యెందు వోయీ నీ మోహము యేల వేగిరించేవు
(॥పల్లవి॥)
యెందు వోయీ నీ మోహము యేల వేగిరించేవు
చెందినదాన నే కానా చెనకేవు గాక
(॥॥)
గుట్టున నా చన్నులు నీకు మీఁదెత్తినవే కావా
బెట్టుగాఁ బెనఁగి చేతఁబట్టే వు గాక
నెట్టన నా చూపులకు నీవే గుఱిగావా
యిట్టే నావంచిన తల యెత్తేవు గాక
(॥॥)
నిరతి నా చిఱునవ్వు నీ మీఁదఁ జల్లేదే కాదా
కెరలింపు మాటల రేఁగించేవు గాక
ధర నా మనసు నీకు దక్కి వుండినదే కావా
కరఁగించి భ్రమయించి కై కొనేవు గాకా
(॥॥)
వుమ్మడి నా మేను నీ సొమ్మై వుండినదే కాదా
నెమ్మది నీ కౌఁగిట నించేవు గాకా
యిమ్ముల శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
నమ్మి కెచ్చి ననుపులు నటించేవు గాకా
(||pallavi||)
yĕṁdu voyī nī mohamu yela vegiriṁchevu
sĕṁdinadāna ne kānā sĕnagevu gāga
(||||)
guṭṭuna nā sannulu nīgu mīm̐dĕttinave kāvā
bĕṭṭugām̐ bĕnam̐gi sedam̐baṭṭe vu gāga
nĕṭṭana nā sūbulagu nīve guṟigāvā
yiṭṭe nāvaṁchina tala yĕttevu gāga
(||||)
niradi nā siṟunavvu nī mīm̐dam̐ jallede kādā
kĕraliṁpu māḍala rem̐giṁchevu gāga
dhara nā manasu nīgu dakki vuṁḍinade kāvā
karam̐giṁchi bhramayiṁchi kai kŏnevu gāgā
(||||)
vummaḍi nā menu nī sŏmmai vuṁḍinade kādā
nĕmmadi nī kaum̐giḍa niṁchevu gāgā
yimmula śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi
nammi kĕchchi nanubulu naḍiṁchevu gāgā