Yemdarim daam bemdlaadinaa nidave kaani

యెందరిఁ దాఁ బెండ్లాడినా నితవే కాని
Language

(॥పల్లవి॥)
యెందరిఁ దాఁ బెండ్లాడినా నితవే కాని
పొందులు తనకు నాకు పొద్దు కొక కొత్తలూ

(॥॥)
మొనపి చన్ను లెంతైనా తనకు వేసట గాదు
మన సెంత దవ్వేఁగినా మఱి యలుపే లేదు
తను వెంత భోగించినాఁ దనివి యెన్నఁడు లేదు
యెనసెఁ దనకు నాకు నెరవే లేదు

(॥॥)
వల పెంత గనమైన వలదని తోయరాదు
కలి మెంత యెక్కుడైనా కడు మొగచాటు గాదు
కలిగితేఁ జక్కదనము కొలఁది పెట్టఁగ రాదు
లలిఁదా నెంత మీరినా చలము లేదు నాకు

(॥॥)
కొమరేపాయ మెంత కూడినాను మోపు గాదు
తమి యెంత రేఁగినా చేతనుఁ బట్ట వస గాదు
సమరతి శ్రీ వేంకటేశ్వరుఁడు తా నన్నుఁగూడె
రమణుఁ దాయను యే నేరమీ నిఁకలేదు

(||pallavi||)
yĕṁdarim̐ dām̐ bĕṁḍlāḍinā nidave kāni
pŏṁdulu tanagu nāgu pŏddu kŏga kŏttalū

(||||)
mŏnabi sannu lĕṁtainā tanagu vesaḍa gādu
mana sĕṁta davvem̐ginā maṟi yalube ledu
tanu vĕṁta bhogiṁchinām̐ danivi yĕnnam̐ḍu ledu
yĕnasĕm̐ danagu nāgu nĕrave ledu

(||||)
vala pĕṁta ganamaina valadani toyarādu
kali mĕṁta yĕkkuḍainā kaḍu mŏgasāḍu gādu
kaligidem̐ jakkadanamu kŏlam̐di pĕṭṭam̐ga rādu
lalim̐dā nĕṁta mīrinā salamu ledu nāgu

(||||)
kŏmarebāya mĕṁta kūḍinānu mobu gādu
tami yĕṁta rem̐ginā sedanum̐ baṭṭa vasa gādu
samaradi śhrī veṁkaḍeśhvarum̐ḍu tā nannum̐gūḍĕ
ramaṇum̐ dāyanu ye neramī nim̐kaledu