యెందాఁకా సిగ్గువడే విప్పుడు నీవు
(॥పల్లవి॥)
యెందాఁకా సిగ్గువడే విప్పుడు నీవు
కందువ లెల్లా నంటి కౌఁగిలించరాదా
(॥॥)
వూచిన తంగేడువలెఁ బొలఁతి నిలుచున్నది
కూచుండు మనరాదా కోరి నీ వద్ద
రాచిలుక వలెనే రవళిగా మాట లాడీ
చే చేత మెచ్చి సంతోసించఁగరాదా
(॥॥)
యెలమి రాయంచవలె నింటికి వచ్చె నప్పుడే
చెలరేఁగి కాఁపురాలు సేయరాదా
కొలని తుమ్మెదవలె కోరి నిన్నుఁ బాయలేదు
పిలిచి లాలన సేసి బెరయఁ గరాదా
(॥॥)
అందపుఁ గోవెలవలె ఆకు కొరికి నీ కిచ్చీ
చెంది పొత్తుల వీడెము సేయరాదా
యిందునే శ్రీ వేంకటేశ యీకె నిట్టే యేలితివి
పొందుల రతులు దలపోసుకొనరాదా
(||pallavi||)
yĕṁdām̐kā sigguvaḍe vippuḍu nīvu
kaṁduva lĕllā naṁṭi kaum̐giliṁcharādā
(||||)
vūsina taṁgeḍuvalĕm̐ bŏlam̐ti nilusunnadi
kūsuṁḍu manarādā kori nī vadda
rāsiluga valĕne ravaḽigā māḍa lāḍī
se seda mĕchchi saṁtosiṁcham̐garādā
(||||)
yĕlami rāyaṁchavalĕ niṁṭigi vachchĕ nappuḍe
sĕlarem̐gi kām̐purālu seyarādā
kŏlani tummĕdavalĕ kori ninnum̐ bāyaledu
pilisi lālana sesi bĕrayam̐ garādā
(||||)
aṁdabum̐ govĕlavalĕ āgu kŏrigi nī kichchī
sĕṁdi pŏttula vīḍĕmu seyarādā
yiṁdune śhrī veṁkaḍeśha yīgĕ niṭṭe yelidivi
pŏṁdula radulu dalabosugŏnarādā