Yemdaagaa mogamoda meedanidoda

యెందాకా మొగమోట మీతనితోడ
Language

(॥పల్లవి॥)
యెందాకా మొగమోట మీతనితోడ
చెంది యాకె వలపెల్లాఁ జెప్పరే విభునికి

(॥॥)
తలకొన్న తలపోఁత తతిగొన్న బయలింత
వలరా జీపెకుఁ దొల్లి వ్రాసిన వ్రాఁత
చెలువుఁడు రాఁడాయ జిగి వెన్నెల వేఁడాయ
చెలఁగి యీ మాటలే చెప్పరే విభునికి

(॥॥)
యెదురు చూచే చూపు యెడలేని తరితీపు
యిదే జవ్వనమే సేసె నింత రారాఁపు
యెదిగెఁ జనుఁగొండలు యేఁచె విరహ పెండలు
చెదరక యీమాటలే చెప్పరే విభునికి

(॥॥)
మోవికిఁ దేనెలు విందు ముచ్చట కిదే సందు
శ్రీ వేంకటేశుఁడీపె తోఁజేసెఁ బొందు
వావు లిద్దరికిఁ గూడె వలరాచబల మోడె
చేవమీర నీ మాటలే చెప్పరే విభునికి

(||pallavi||)
yĕṁdāgā mŏgamoḍa mīdanidoḍa
sĕṁdi yāgĕ valabĕllām̐ jĕppare vibhunigi

(||||)
talagŏnna talabom̐ta tadigŏnna bayaliṁta
valarā jībĕgum̐ dŏlli vrāsina vrām̐ta
sĕluvum̐ḍu rām̐ḍāya jigi vĕnnĕla vem̐ḍāya
sĕlam̐gi yī māḍale sĕppare vibhunigi

(||||)
yĕduru sūse sūbu yĕḍaleni taridību
yide javvaname sesĕ niṁta rārām̐pu
yĕdigĕm̐ janum̐gŏṁḍalu yem̐sĕ viraha pĕṁḍalu
sĕdaraga yīmāḍale sĕppare vibhunigi

(||||)
movigim̐ denĕlu viṁdu muchchaḍa kide saṁdu
śhrī veṁkaḍeśhum̐ḍībĕ tom̐jesĕm̐ bŏṁdu
vāvu liddarigim̐ gūḍĕ valarāsabala moḍĕ
sevamīra nī māḍale sĕppare vibhunigi