Yemchugomte ninnu nannu nemta kemta

యెంచుకొంటే నిన్ను నన్ను నెంత కెంత
Language

(॥పల్లవి॥)
యెంచుకొంటే నిన్ను నన్ను నెంత కెంత
పంచబాణుని బలము పంగెనల వారము

(॥॥)
మన సియ్య నేరుతువు మరిగించ నేరుతువు
నినుపులుగాఁ గృప నించ నేర్తువు
వినయాన నేము సేసే విన్నపము లే మున్నవి
తనివోని కోరికలఁ దగిలేటి వారము

(॥॥)
తమి రేఁచాఁ గలవు తమకించాఁ గలవు
అమరఁగఁ జనవు లియ్యఁగఁ గలవు
ప్రమదాన నేము నీకు బత్తి సే సే దేమున్నది
కొమరెపాయముతోడఁ గొసరేటివారమూ

(॥॥)
వొడివట్ట నోపుదు వొనగూడా నోపుదువు
కడు శ్రీ వేంకటేశ చొక్క నోపుదువూ
అడరి యలమేల్మంగ కాపె పంత మేమున్నది
యెడయక నీ సేవకు నిరవైనవారమూ

(||pallavi||)
yĕṁchugŏṁṭe ninnu nannu nĕṁta kĕṁta
paṁchabāṇuni balamu paṁgĕnala vāramu

(||||)
mana siyya neruduvu marigiṁcha neruduvu
ninubulugām̐ gṛpa niṁcha nerduvu
vinayāna nemu sese vinnabamu le munnavi
tanivoni korigalam̐ dagileḍi vāramu

(||||)
tami rem̐sām̐ galavu tamagiṁchām̐ galavu
amaram̐gam̐ janavu liyyam̐gam̐ galavu
pramadāna nemu nīgu batti se se demunnadi
kŏmarĕbāyamudoḍam̐ gŏsareḍivāramū

(||||)
vŏḍivaṭṭa nobudu vŏnagūḍā nobuduvu
kaḍu śhrī veṁkaḍeśha sŏkka nobuduvū
aḍari yalamelmaṁga kābĕ paṁta memunnadi
yĕḍayaga nī sevagu niravainavāramū