Yemchagu naanerami yemtagobi nainaanu

యెంచకు నానేరమి యెంతకోపి నైనాను
Language

(॥పల్లవి॥)
యెంచకు నానేరమి యెంతకోపి నైనాను
నించి నన్నేలుకొనుటే నీ నేర్పు

(॥॥)
పాసివున్న తమకానఁ బడఁతు లే మాడినాను
వాసితో నేర్చిన మగవానిదే నేర్పు
ఆసలతోడఁ బెనఁగి అట్టే కొంగు వట్టి తేను
వోసరించి గుట్టు తోడ నుండుటే నేర్పు

(॥॥)
తగులైనది పెనఁగి తా నెం తలయించినాను
నగుతా నోరిచిన జాణనిదే నేర్పు
వెగటైన కాతరాన వేసటగాఁ గొల్చినాను
పగటున నాదరించి పాయనిదే నేర్పు

(॥॥)
కాఁకలఁ బొరలినది కౌఁగిటఁ గొసరినాను
సోఁ కోర్చి మెచ్చే సరసునిదే నేర్పు
యాఁకట శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
వాకముగాఁ గూడితివి వడి నిదే నేర్పు

(||pallavi||)
yĕṁchagu nānerami yĕṁtagobi nainānu
niṁchi nannelugŏnuḍe nī nerbu

(||||)
pāsivunna tamagānam̐ baḍam̐tu le māḍinānu
vāsido nersina magavānide nerbu
āsaladoḍam̐ bĕnam̐gi aṭṭe kŏṁgu vaṭṭi tenu
vosariṁchi guṭṭu toḍa nuṁḍuḍe nerbu

(||||)
tagulainadi pĕnam̐gi tā nĕṁ talayiṁchinānu
nagudā norisina jāṇanide nerbu
vĕgaḍaina kādarāna vesaḍagām̐ gŏlsinānu
pagaḍuna nādariṁchi pāyanide nerbu

(||||)
kām̐kalam̐ bŏralinadi kaum̐giḍam̐ gŏsarinānu
som̐ korsi mĕchche sarasunide nerbu
yām̐kaḍa śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
vāgamugām̐ gūḍidivi vaḍi nide nerbu