యేమయ్యా యేనుగతోడి యేలాట లిఁక నీకేల
(॥పల్లవి॥)
యేమయ్యా యేనుగతోడి యేలాట లిఁక నీకేల
కామించి నీకు నీవే కరుణించేవు గాక
(॥॥)
సింగారించు కొన్న నిన్నుఁజేరి సంతోసించుఁ గాక
అంగన యెఱుఁగునా ఆ సుద్దులు
ముంగిట నీ వుండఁగాను ముంచి కైలా గిచ్చుఁ గాక
సంగతి యెందు వోయే వని సారె నిన్ను నడుగ
(॥॥)
చెమరించీ నని మేను చెలఁగి విసరుఁ గాక
రమణి నీసుద్దు లెల్లా రచ్చవేసునా
జమళి నీ సేవ సేసి చవులు వుట్టించుఁ గాక
అమరునా అంతలోనే ఆకె నిను జరయ
(॥॥)
అలరి నీవు గూడితే నానందించుకొనుఁ గాక
అలమేలుమంగ నీ చొప్పులు చూచునా
లలి శ్రీవేంకటేశ నీ లాగులకు నవ్వుఁ గాక
తలపించఁ దగవా తనబత్తి యింకను
(||pallavi||)
yemayyā yenugadoḍi yelāḍa lim̐ka nīgela
kāmiṁchi nīgu nīve karuṇiṁchevu gāga
(||||)
siṁgāriṁchu kŏnna ninnum̐jeri saṁtosiṁchum̐ gāga
aṁgana yĕṟum̐gunā ā suddulu
muṁgiḍa nī vuṁḍam̐gānu muṁchi kailā gichchum̐ gāga
saṁgadi yĕṁdu voye vani sārĕ ninnu naḍuga
(||||)
sĕmariṁchī nani menu sĕlam̐gi visarum̐ gāga
ramaṇi nīsuddu lĕllā rachchavesunā
jamaḽi nī seva sesi savulu vuṭṭiṁchum̐ gāga
amarunā aṁtalone āgĕ ninu jaraya
(||||)
alari nīvu gūḍide nānaṁdiṁchugŏnum̐ gāga
alamelumaṁga nī sŏppulu sūsunā
lali śhrīveṁkaḍeśha nī lāgulagu navvum̐ gāga
talabiṁcham̐ dagavā tanabatti yiṁkanu