యేమయ్యా నీ సుద్దు లాకె యెఱిఁగె నంటానో
(॥పల్లవి॥)
యేమయ్యా నీ సుద్దు లాకె యెఱిఁగె నంటానో
యే మగువ వద్దికైనా నేఁగఁ దలఁచితివో
(॥॥)
చివ్వన నీతో నాపె చిరునవ్వు నవ్వితేను
పువ్వులఁ గొని వేసేవు పూఁచి నీవు
ఇవ్వల నప్పటి నిన్ను నింటికిఁ బిలిచితేను
కువ్వలు వడఁగ నాపె కోక వట్టి తీసేవు
(॥॥)
తేరకొన నిన్నాపె దిష్టించి చూచితేను
బోరన జంకించేవు బొమ్మల నీవు
నేరువుతో నప్పటిని నీకు విందు చెప్పితేను
నోరిలోఁ దమ్ముల మిడి నొక్కేవు చెక్కులు
(॥॥)
వుండుండి శ్రీ వేంకటేశు వుర మాపె యెక్కితేను
నిందు నివ్వెఱఁగు తోడ నిలుచుండేవు
అండనే యలమేల్మంగ అట్టే చన్నుల నొత్తితే
కొండ లంటా మెచ్చి మెచ్చి గోర నూఁదేవూ
(||pallavi||)
yemayyā nī suddu lāgĕ yĕṟim̐gĕ naṁṭāno
ye maguva vaddigainā nem̐gam̐ dalam̐sidivo
(||||)
sivvana nīdo nābĕ sirunavvu navvidenu
puvvulam̐ gŏni vesevu pūm̐si nīvu
ivvala nappaḍi ninnu niṁṭigim̐ bilisidenu
kuvvalu vaḍam̐ga nābĕ koga vaṭṭi tīsevu
(||||)
teragŏna ninnābĕ diṣhṭiṁchi sūsidenu
borana jaṁkiṁchevu bŏmmala nīvu
neruvudo nappaḍini nīgu viṁdu sĕppidenu
norilom̐ dammula miḍi nŏkkevu sĕkkulu
(||||)
vuṁḍuṁḍi śhrī veṁkaḍeśhu vura mābĕ yĕkkidenu
niṁdu nivvĕṟam̐gu toḍa nilusuṁḍevu
aṁḍane yalamelmaṁga aṭṭe sannula nŏttide
kŏṁḍa laṁṭā mĕchchi mĕchchi gora nūm̐devū