Yemayyaa naa manasu nee veṟumganidaa yemi

యేమయ్యా నా మనసు నీ వెఱుఁగనిదా యేమి
Language

(॥పల్లవి॥)
యేమయ్యా నా మనసు నీ వెఱుఁగనిదా యేమి
దీమసపు నా మదిలో దేవరవు నీవూ

(॥॥)
వింతదాననా నీకు వేఁడుకొనే విటు నన్ను
యెంతైనా నీ పట్టుకు నెగ్గు పట్టెనా
అంతే పోనే నీతో నలిగేటిదాననా
పంతముతో నా పాలిటి ప్రాణమవు నీవూ

(॥॥)
పెనఁగుచు నాపై నెంత ప్రియములు చల్లేవు
అనవయ్య నీ మాటల కవుఁగా దనేనా
మనసునఁ బెట్టు కొని మచ్చరించేదాననా
తనివోని నాయింటి నిధానమవు నీవూ

(॥॥)
ఆదరించి ననుఁగడు నలమి లాలించేవు
యే దెస నైనా నీకు నెదు రాడేనా
పోదితో శ్రీ వేంకటేశ పొసఁగ నన్నేలితివి
దా దాతనాయ రతి చింతామణివి నీవూ

(||pallavi||)
yemayyā nā manasu nī vĕṟum̐ganidā yemi
dīmasabu nā madilo devaravu nīvū

(||||)
viṁtadānanā nīgu vem̐ḍugŏne viḍu nannu
yĕṁtainā nī paṭṭugu nĕggu paṭṭĕnā
aṁte pone nīdo naligeḍidānanā
paṁtamudo nā pāliḍi prāṇamavu nīvū

(||||)
pĕnam̐gusu nābai nĕṁta priyamulu sallevu
anavayya nī māḍala kavum̐gā danenā
manasunam̐ bĕṭṭu kŏni machchariṁchedānanā
tanivoni nāyiṁṭi nidhānamavu nīvū

(||||)
ādariṁchi nanum̐gaḍu nalami lāliṁchevu
ye dĕsa nainā nīgu nĕdu rāḍenā
podido śhrī veṁkaḍeśha pŏsam̐ga nannelidivi
dā dādanāya radi siṁtāmaṇivi nīvū