Yemayyaa aabe meemda nimta batti galigidenu

యేమయ్యా ఆపె మీఁద నింత బత్తి గలిగితేను
Language

(॥పల్లవి॥)
యేమయ్యా ఆపె మీఁద నింత బత్తి గలిగితేను
కామించి పెండ్లాడరాదా కాదనేరా నిన్నును

(॥॥)
పలచఁ గా నవ్వు నవ్వి పాపట దువ్వుకొంటా
కొలువు సేసే యాపెఁ గోరి చూచేవు
వలిదపయ్యదలోని వట్రువ గుబ్బలమీఁద
కలువ పువ్వులు వేసి కాంతాళించేవూ

(॥॥)
వీడెపు సెలవి తోడ వీఁగి సిగ్గువడుకొంటా
కూడి మాడి వున్నయాపెఁ గొంగు వట్టేవు
జాడతోడ నిట్టే మేని చక్కఁదనాలకు మెచ్చి
చేడెలతోఁ బొగడుతాఁ జెలరేఁగేవూ

(॥॥)
యింతుల సన్నలు సేసి యేకతము లాడుకొంటా
చెంత నున్నయాపె మీఁదఁ జేయివేసేవూ
యింతలోనే శ్రీ వేంకటేశ మమ్ము నేలితివి
పొంత నీ చెలి కౌఁగిట భోగించేవూ

(||pallavi||)
yemayyā ābĕ mīm̐da niṁta batti galigidenu
kāmiṁchi pĕṁḍlāḍarādā kādanerā ninnunu

(||||)
palasam̐ gā navvu navvi pābaḍa duvvugŏṁṭā
kŏluvu sese yābĕm̐ gori sūsevu
validabayyadaloni vaṭruva gubbalamīm̐da
kaluva puvvulu vesi kāṁtāḽiṁchevū

(||||)
vīḍĕbu sĕlavi toḍa vīm̐gi sigguvaḍugŏṁṭā
kūḍi māḍi vunnayābĕm̐ gŏṁgu vaṭṭevu
jāḍadoḍa niṭṭe meni sakkam̐danālagu mĕchchi
seḍĕladom̐ bŏgaḍudām̐ jĕlarem̐gevū

(||||)
yiṁtula sannalu sesi yegadamu lāḍugŏṁṭā
sĕṁta nunnayābĕ mīm̐dam̐ jeyivesevū
yiṁtalone śhrī veṁkaḍeśha mammu nelidivi
pŏṁta nī sĕli kaum̐giḍa bhogiṁchevū