Yemayya vatti kadalela gadimchugonebu

యేమయ్య వట్టి కతలేల గడించుకొనేపు
Language

(॥పల్లవి॥)
యేమయ్య వట్టి కతలేల గడించుకొనేపు
నేమపు నా గుణములు నీవే యెఱుఁగవా

(॥॥)
దొంతి నున్న నా వలపు తూరుపెత్తితిఁ గాక
పంతము చూపితినా పదరినీకు
చింత లెల్ల బౌఁ జు చూచి చెక్కుచేత నుంటిఁగాక
అంతరంగమున నీతో నలిగి వుండితినా

(॥॥)
మువ్వంక నా సిగ్గులు మూలల దాఁచితి గాక
అవ్వలి మోమైతినా అప్పటి నీతో
పువ్వు వంటి యాస ముడుపుగఁ గట్టు కొంటిఁగాక
నివ్వటిల్లు బొమ్మముడి నీపైఁ బెట్టి తినా

(॥॥)
గక్కన నా జవ్వనము కానుక వట్టితిఁ గాక
వుక్కుమీఱి గుబ్బల నిన్నొరసితినా
అక్కున శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
మొక్కితిఁగాక రతుల మొనగో రూఁదితినా

(||pallavi||)
yemayya vaṭṭi kadalela gaḍiṁchugŏnebu
nemabu nā guṇamulu nīve yĕṟum̐gavā

(||||)
dŏṁti nunna nā valabu tūrubĕttidim̐ gāga
paṁtamu sūbidinā padarinīgu
siṁta lĕlla baum̐ ju sūsi sĕkkuseda nuṁṭim̐gāga
aṁtaraṁgamuna nīdo naligi vuṁḍidinā

(||||)
muvvaṁka nā siggulu mūlala dām̐sidi gāga
avvali momaidinā appaḍi nīdo
puvvu vaṁṭi yāsa muḍubugam̐ gaṭṭu kŏṁṭim̐gāga
nivvaḍillu bŏmmamuḍi nībaim̐ bĕṭṭi tinā

(||||)
gakkana nā javvanamu kānuga vaṭṭidim̐ gāga
vukkumīṟi gubbala ninnŏrasidinā
akkuna śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
mŏkkidim̐gāga radula mŏnago rūm̐didinā