యేమయ్య ప్రియము చెప్పే వెంతేసి నాకు
(॥పల్లవి॥)
యేమయ్య ప్రియము చెప్పే వెంతేసి నాకు
నీ మతిలోదానఁ గాక నీకు వింతదాననా
(॥॥)
నేరుపుతోడ నాతో నీవు మాటలాడఁగాను
గారవించి వినేఁగాక కాదనేనా
సారె సారె నీవు నాకు చనవు లొసఁగఁ గాను
కొరి సంతోసించేఁ గాక కోపగించేనా
(॥॥)
చేయి చాఁచి నీ వప్పటి చెనకఁగ రాఁగాను
కాయము నీ కొగ్గేఁ గాక కా దనేనా
ఆయములు మోవ నీవు అట్టే నాతో నవ్వఁగాను
చాయలో మెలఁగేఁ గాక సాదించేనా
(॥॥)
అందము లెఱిఁ గి నీవు అంతలోనే కూడఁగాను
కందువలు మెచ్చేఁగాక కాదనేనా
ఇందరిలో శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
పొందులు నెరపిఁ గాక పోల దనేనా
(||pallavi||)
yemayya priyamu sĕppe vĕṁtesi nāgu
nī madilodānam̐ gāga nīgu viṁtadānanā
(||||)
nerubudoḍa nādo nīvu māḍalāḍam̐gānu
gāraviṁchi vinem̐gāga kādanenā
sārĕ sārĕ nīvu nāgu sanavu lŏsam̐gam̐ gānu
kŏri saṁtosiṁchem̐ gāga kobagiṁchenā
(||||)
seyi sām̐si nī vappaḍi sĕnagam̐ga rām̐gānu
kāyamu nī kŏggem̐ gāga kā danenā
āyamulu mova nīvu aṭṭe nādo navvam̐gānu
sāyalo mĕlam̐gem̐ gāga sādiṁchenā
(||||)
aṁdamu lĕṟim̐ gi nīvu aṁtalone kūḍam̐gānu
kaṁduvalu mĕchchem̐gāga kādanenā
iṁdarilo śhrī veṁkaḍeśha nannu nelidivi
pŏṁdulu nĕrabim̐ gāga pola danenā