Yemayya neegu naagu nemta kemta amtaramu

యేమయ్య నీకు నాకు నెంత కెంత అంతరము
Language

(॥పల్లవి॥)
యేమయ్య నీకు నాకు నెంత కెంత అంతరము
ఆముకొని నాకుఁ బ్రియము చెప్పేవయ్యా

(॥॥)
యెట్టు సేసినా నిన్ను నెగ్గు లెంచేదాననా
బట్టబయ లేల వొడఁ బరచేవయ్య
పట్టి పెనఁగఁగా నేను పంతమున బిగిసేనా
వెట్టికి నీ వెంతేసి వేఁడుకొనేవయ్యా

(॥॥)
చిత్తగించు మెప్పుడూ నీ చేతిలోనిదానను
బత్తి సేసీ నన్ను నెంత పై కొనేవయ్యా
యెత్తలఁ జూచినాను ఇచ్చకురాల నీకు
పొత్తుల మాఁటల నెంత పొదిగేవయ్యా

(॥॥)
యేపనులు చెప్పినాను ఇయ్యకొనేదాన నీకు
చేపట్టి సన్నలు యేమి సేసేవయ్య
రాపుల శ్రీ వేంకటేశ రతి నలమేల్మంగను
నా పాలి వాఁడవు నిన్ను నమ్మితినయ్యా

(||pallavi||)
yemayya nīgu nāgu nĕṁta kĕṁta aṁtaramu
āmugŏni nāgum̐ briyamu sĕppevayyā

(||||)
yĕṭṭu sesinā ninnu nĕggu lĕṁchedānanā
baṭṭabaya lela vŏḍam̐ barasevayya
paṭṭi pĕnam̐gam̐gā nenu paṁtamuna bigisenā
vĕṭṭigi nī vĕṁtesi vem̐ḍugŏnevayyā

(||||)
sittagiṁchu mĕppuḍū nī sedilonidānanu
batti sesī nannu nĕṁta pai kŏnevayyā
yĕttalam̐ jūsinānu ichchagurāla nīgu
pŏttula mām̐ṭala nĕṁta pŏdigevayyā

(||||)
yebanulu sĕppinānu iyyagŏnedāna nīgu
sebaṭṭi sannalu yemi sesevayya
rābula śhrī veṁkaḍeśha radi nalamelmaṁganu
nā pāli vām̐ḍavu ninnu nammidinayyā