Yemanunnado nee sitta meṟamga nenu

యేమనున్నదో నీ చిత్త మెఱఁగ నేను
Language

(॥పల్లవి॥)
యేమనున్నదో నీ చిత్త మెఱఁగ నేను
దీముగా నిం కామీఁదఁ దెలుసుకొమ్మీ

(॥॥)
యెగసక్కేనకు నిన్ను నేమైనా నందుఁ గాని
పగటు నీ మీఁద నాకుఁ బ్రాణము సుమ్మీ
అగ డయ్యీనని నీతో నాడుకో వెఱతుఁ గాని
మిగుల వలచినట్టి మెలఁతఁ జుమ్మీ

(॥॥)
నవ్వులకు నీతో మిన్నక యలుగుదుఁ గాని
నివ్వటిల్ల నీటు నీవే నేఁ జుమ్మీ
జవ్వనమదాన నిన్ను జంకించి దూరుదుఁ గాని
పువ్వు వలె నందరితోఁ బొగడుదుఁ జుమ్మీ

(॥॥)
దార కాన గుట్టు తోడఁ దల వంచుకుందుఁ గాని
మేరతో నీపై తమి మిగులాఁ జుమ్మీ
యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితిని
కోరికలు కోటానఁ గోట్లు సుమ్మీ.

(||pallavi||)
yemanunnado nī sitta mĕṟam̐ga nenu
dīmugā niṁ kāmīm̐dam̐ dĕlusugŏmmī

(||||)
yĕgasakkenagu ninnu nemainā naṁdum̐ gāni
pagaḍu nī mīm̐da nāgum̐ brāṇamu summī
aga ḍayyīnani nīdo nāḍugo vĕṟadum̐ gāni
migula valasinaṭṭi mĕlam̐tam̐ jummī

(||||)
navvulagu nīdo minnaga yalugudum̐ gāni
nivvaḍilla nīḍu nīve nem̐ jummī
javvanamadāna ninnu jaṁkiṁchi dūrudum̐ gāni
puvvu valĕ naṁdaridom̐ bŏgaḍudum̐ jummī

(||||)
dāra kāna guṭṭu toḍam̐ dala vaṁchuguṁdum̐ gāni
merado nībai tami migulām̐ jummī
yī rīdi śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidini
korigalu koḍānam̐ goṭlu summī.