యేమని విన్నవించేను యిన్నీ నాతఁడే యెఱుఁగు
(॥పల్లవి॥)
యేమని విన్నవించేను యిన్నీ నాతఁడే యెఱుఁగు
వోముచుఁ దా మన్నించేది వొక్కటే గుఱుతు
(॥॥)
మలసి మాటలాడితే మఱి యెన్నైనాఁ గలవు
కలసి పొందు సేసితే కాంక్ష తీరదు
చెలరేఁగి చెప్పితేను శేనాశేన ప్రియములు
వలపుల కెందుఁ గడవర లేదే చెలియా
(॥॥)
కన్నులఁ జూచేనంటే కమ్ముకొనీ వేడుకలు
యెన్నుకొంటేఁ దల పోఁత లింతా మోఁతలు
వున్నతి మెఱసితేను వుడివోదు తమకము
వెన్నడించే కోరికకు వెల లేదే చెలియా
(॥॥)
మంతనమాడే నంటే మతికిఁ దనివి లేదు
చెంత నెంత పాయకున్నా సిగ్గు మానదు
యింతటె శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
సంతసపుట్టి రతికి సరి లేదే చెలియా
(||pallavi||)
yemani vinnaviṁchenu yinnī nādam̐ḍe yĕṟum̐gu
vomusum̐ dā manniṁchedi vŏkkaḍe guṟudu
(||||)
malasi māḍalāḍide maṟi yĕnnainām̐ galavu
kalasi pŏṁdu seside kāṁkṣha tīradu
sĕlarem̐gi sĕppidenu śhenāśhena priyamulu
valabula kĕṁdum̐ gaḍavara lede sĕliyā
(||||)
kannulam̐ jūsenaṁṭe kammugŏnī veḍugalu
yĕnnugŏṁṭem̐ dala pom̐ta liṁtā mom̐talu
vunnadi mĕṟasidenu vuḍivodu tamagamu
vĕnnaḍiṁche korigagu vĕla lede sĕliyā
(||||)
maṁtanamāḍe naṁṭe madigim̐ danivi ledu
sĕṁta nĕṁta pāyagunnā siggu mānadu
yiṁtaḍĕ śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
saṁtasabuṭṭi radigi sari lede sĕliyā