యేమని విన్నవించేనే యిఁకఁ దనకు
(॥పల్లవి॥)
యేమని విన్నవించేనే యిఁకఁ దనకు
చే ముంచి తానే దయసేసెఁ గాకా
(॥॥)
చెప్పరాని సుద్దులకు సేయరాని చేఁతలకు
వొప్పి తన కొడఁబడి వున్నదాన నేను
కుప్పలైన యాసలకు గుఱిలేని కోరికెకు
తప్పక గుఱి యైతిని తనకుఁ గా నేనూ
(॥॥)
నెట్టు కొన్న మొక్కులకు నిండుకొన్న ప్రియాలకు
వొట్టు కొని కాచుక వున్నదాన నేను
కట్టిన కంకణానకు కడుఁ జుట్టరికేనకు
యిట్టే పాలుపడి తన కిర వైతిని
(॥॥)
వీడరాని పొందులకు వేడుక కూటములకు
వోడక తన యెదుట నున్నదాన నేను
యీడనే శ్రీ వేంకటేశుఁడింతలోఁ దా నన్ను నేలె
తోడునీడ వలె నిట్టే దొరసితి నేను
(||pallavi||)
yemani vinnaviṁchene yim̐kam̐ danagu
se muṁchi tāne dayasesĕm̐ gāgā
(||||)
sĕpparāni suddulagu seyarāni sem̐talagu
vŏppi tana kŏḍam̐baḍi vunnadāna nenu
kuppalaina yāsalagu guṟileni korigĕgu
tappaga guṟi yaidini tanagum̐ gā nenū
(||||)
nĕṭṭu kŏnna mŏkkulagu niṁḍugŏnna priyālagu
vŏṭṭu kŏni kāsuga vunnadāna nenu
kaṭṭina kaṁkaṇānagu kaḍum̐ juṭṭarigenagu
yiṭṭe pālubaḍi tana kira vaidini
(||||)
vīḍarāni pŏṁdulagu veḍuga kūḍamulagu
voḍaga tana yĕduḍa nunnadāna nenu
yīḍane śhrī veṁkaḍeśhum̐ḍiṁtalom̐ dā nannu nelĕ
toḍunīḍa valĕ niṭṭe dŏrasidi nenu