Yemani vinnavimchemu yimti mohamu neemeemda

యేమని విన్నవించేము యింతి మోహము నీమీఁద
Language

(॥పల్లవి॥)
యేమని విన్నవించేము యింతి మోహము నీమీఁద
ఆమని వేడుకలై అంటుకొనఁ జొచ్చెను

(॥॥)
తలఁపు లోపలి సిగ్గు దాఁచుకొనఁ జోటు లేక
సెలవుల నవ్వులై చిందఁ జొచ్చెను
వలపులు మూసిపెట్ట వసముగాక యవే
వులివచ్చి పలుకులై వుప్పొంగఁ జొచ్చెను

(॥॥)
యెన్నరాని యడియాస లిముడుకోఁ జోటు లేక
కన్నుఁగొన చూపులై కమ్మఁ జొచ్చెను
అన్నిటాను తమకము లణఁచఁగఁ జోటు లేక
వున్నతపుఁ జెమటలై వూరఁ జొచ్చెను

(॥॥)
కలసిన సంతోసము కట్టి పెట్టఁ జోటు లేక
నిలిచి మోము కళలై నిండఁ జొచ్చెను
యెలమి శ్రీ వేంకటేశ యింతిఁ గూడినరతులు
తలకొన్న సరసమై దైవారఁ జొచ్చెనూ

(||pallavi||)
yemani vinnaviṁchemu yiṁti mohamu nīmīm̐da
āmani veḍugalai aṁṭugŏnam̐ jŏchchĕnu

(||||)
talam̐pu lobali siggu dām̐sugŏnam̐ joḍu lega
sĕlavula navvulai siṁdam̐ jŏchchĕnu
valabulu mūsibĕṭṭa vasamugāga yave
vulivachchi palugulai vuppŏṁgam̐ jŏchchĕnu

(||||)
yĕnnarāni yaḍiyāsa limuḍugom̐ joḍu lega
kannum̐gŏna sūbulai kammam̐ jŏchchĕnu
anniḍānu tamagamu laṇam̐sam̐gam̐ joḍu lega
vunnadabum̐ jĕmaḍalai vūram̐ jŏchchĕnu

(||||)
kalasina saṁtosamu kaṭṭi pĕṭṭam̐ joḍu lega
nilisi momu kaḽalai niṁḍam̐ jŏchchĕnu
yĕlami śhrī veṁkaḍeśha yiṁtim̐ gūḍinaradulu
talagŏnna sarasamai daivāram̐ jŏchchĕnū