Yemani vinnavimchemu yevvarinim gaadanemu

యేమని విన్నవించేము యెవ్వరినిఁ గాదనేము
Language

(॥పల్లవి॥)
యేమని విన్నవించేము యెవ్వరినిఁ గాదనేము
కోమటిసాకిరులాయ గొబ్బున మా మాఁటలు

(॥యేమ॥)
సరసము లాడఁగానే జామువోయఁ దెల్లవారె
తరవులు వెట్టి మాకు దగదొట్టెను
శిరసు వట్టి చెనకఁగఁ జెనకఁగ
తరుణి సిగ్గులువడి తలవంచె నదివో

(॥యేమ॥)
యెగసక్కేలాడఁ గానే యెండగాసె నీడవచ్చె
తగవులు చెప్పి మాకుఁ దడవాయను
బిగువెక్కెఁ గుచములు పిలువఁగఁ బిలువఁగ
మగువ జవ్వనమున మదమెత్తెనదివో

(॥యేమ॥)
చేతులు చాఁచఁగానే చీఁకటెల్లా వెన్నలాయ
నీతులు బోదించ మాకు నెపమాయను
యేతుల శ్రీ వేంకటేశ ఇట్టె నీవు గూడఁ గూడ
యీ తరుణి వురము పై నిరవాయ నిదివో

(||pallavi||)
yemani vinnaviṁchemu yĕvvarinim̐ gādanemu
komaḍisāgirulāya gŏbbuna mā mām̐ṭalu

(||yema||)
sarasamu lāḍam̐gāne jāmuvoyam̐ dĕllavārĕ
taravulu vĕṭṭi māgu dagadŏṭṭĕnu
śhirasu vaṭṭi sĕnagam̐gam̐ jĕnagam̐ga
taruṇi sigguluvaḍi talavaṁchĕ nadivo

(||yema||)
yĕgasakkelāḍam̐ gāne yĕṁḍagāsĕ nīḍavachchĕ
tagavulu sĕppi māgum̐ daḍavāyanu
biguvĕkkĕm̐ gusamulu piluvam̐gam̐ biluvam̐ga
maguva javvanamuna madamĕttĕnadivo

(||yema||)
sedulu sām̐sam̐gāne sīm̐kaḍĕllā vĕnnalāya
nīdulu bodiṁcha māgu nĕbamāyanu
yedula śhrī veṁkaḍeśha iṭṭĕ nīvu gūḍam̐ gūḍa
yī taruṇi vuramu pai niravāya nidivo