Yemani vinnavimche nee vimta sesidivi nannu

యేమని విన్నవించె నీ వింత సేసితివి నన్ను
Language

(॥పల్లవి॥)
యేమని విన్నవించె నీ వింత సేసితివి నన్ను
చే ముంచి మా బ్రతుకు నీ చేతిది సుమ్మయ్యా

(॥॥)
దగ్గరి నీవు రాకున్న తమకింతు నొకవేళ
సిగ్గుపడుదు నంతలో చేయి వేసితే
వెగ్గళింతు నీ వట్టే వేరే పరాకు సేసితే
బగ్గన నీ మీఁది భ్రమ వట్టె నయ్య నాకూ

(॥॥)
చెంత నీవు చూచుదాఁకా చేయెత్తి మొక్కుదు నీకు
మంతనాన మాటాడితే మఱతు మేను
యింతలో గోర నంటితే యెచ్చరి నవ్వుదు నీతో
యెంత నీ వలపు దలకెక్కెనో నాకూ

(॥॥)
వెలుపల నీ వుండితే వేగఁ బిలువ నంపుదు
చెలఁగి యిట్టే కూడితే చెక్కు నొక్కుదు
యెలమి శ్రీ వేంకటేశ యిదివో కలసితివి
యిలలో నా జవ్వనమే యింత సేసే నాకూ.

(||pallavi||)
yemani vinnaviṁchĕ nī viṁta sesidivi nannu
se muṁchi mā bradugu nī sedidi summayyā

(||||)
daggari nīvu rāgunna tamagiṁtu nŏgaveḽa
siggubaḍudu naṁtalo seyi veside
vĕggaḽiṁtu nī vaṭṭe vere parāgu seside
baggana nī mīm̐di bhrama vaṭṭĕ nayya nāgū

(||||)
sĕṁta nīvu sūsudām̐kā seyĕtti mŏkkudu nīgu
maṁtanāna māḍāḍide maṟadu menu
yiṁtalo gora naṁṭide yĕchchari navvudu nīdo
yĕṁta nī valabu dalagĕkkĕno nāgū

(||||)
vĕlubala nī vuṁḍide vegam̐ biluva naṁpudu
sĕlam̐gi yiṭṭe kūḍide sĕkku nŏkkudu
yĕlami śhrī veṁkaḍeśha yidivo kalasidivi
yilalo nā javvaname yiṁta sese nāgū.