Yemani seppudune yimka meedonu

యేమని చెప్పుదునే యిఁక మీతోను
Language

(॥పల్లవి॥)
యేమని చెప్పుదునే యిఁక మీతోను
ఆముకొన్న నా బత్తి యది తా నెఱుఁగునే

(॥॥)
చల మెంత సాదించినా చవులెన్ని వుట్టించినా
తలఁపు కొలఁదే కాక తమి వుట్టీనా
యెలమీ వో చెలులాల యెడమాట లె న్నాడినా
కొలఁ ది మీఱఁ గ నిట్టే కూడినట్టయ్యీనా

(॥॥)
కత లెన్ని చెప్పినాను కాఁ క లెన్ని రేఁ చినాను
యితవై నంతె కాక యెక్కు డయ్యీనా
చతురత మెఱయుచు సారె నెంత పెనఁగినా
మతి కింపై నటువలె మచ్చిక వుట్టీనా

(॥॥)
వాడి కెంత చూపినాను వావు లెన్ని చెప్పినాను
వేడుక గలంతే కాక వెగ్గళ మౌనా
యీడనే శ్రీ వేంకటేశుఁడింతలో నన్నేలినాఁడు
యీడు జోడు లాయ నిఁక నెరవు లయ్యీనా

(||pallavi||)
yemani sĕppudune yim̐ka mīdonu
āmugŏnna nā batti yadi tā nĕṟum̐gune

(||||)
sala mĕṁta sādiṁchinā savulĕnni vuṭṭiṁchinā
talam̐pu kŏlam̐de kāga tami vuṭṭīnā
yĕlamī vo sĕlulāla yĕḍamāḍa lĕ nnāḍinā
kŏlam̐ di mīṟam̐ ga niṭṭe kūḍinaṭṭayyīnā

(||||)
kada lĕnni sĕppinānu kām̐ ka lĕnni rem̐ sinānu
yidavai naṁtĕ kāga yĕkku ḍayyīnā
sadurada mĕṟayusu sārĕ nĕṁta pĕnam̐ginā
madi kiṁpai naḍuvalĕ machchiga vuṭṭīnā

(||||)
vāḍi kĕṁta sūbinānu vāvu lĕnni sĕppinānu
veḍuga galaṁte kāga vĕggaḽa maunā
yīḍane śhrī veṁkaḍeśhum̐ḍiṁtalo nannelinām̐ḍu
yīḍu joḍu lāya nim̐ka nĕravu layyīnā