Yemani pogadudune yiduvamti naa vibhuni

యేమని పొగడుదునే యిటువంటి నా విభుని
Language

(॥పల్లవి॥)
యేమని పొగడుదునే యిటువంటి నా విభుని
యీ మేలు నే మఱవను యెప్పుడూ ననవే

(॥॥)
యెంత పరాకై వుండినా నెదుటికి నే వచ్చితే
సంతోసాన మోము చూచి చనవిచ్చునే
వింతలుగా నిద్రించేవేళ నేఁ బాదా లొత్తితే
అంతలోనే లేచి నన్ను నాదరించునే

(॥॥)
యే పొద్దు నే వచ్చినాను యెదురుకొని లాలించి
చేపట్టి కౌఁగిలించి సేద దేర్చునే
చాపలాన సిగ్గుతోనె సముకాన నుండినాను
చాఁపునే చేతులు నా చన్నుల మీఁదటనే

(॥॥)
యెచ్చి రాజసానఁ దాను యేకతాన నుండినాను
మచ్చిక నాతో నవ్వి మన్నించునే
ఇచ్చట శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
ఇచ్చగించి నన్ను నేలె యెన్నఁడునుఁ బాయఁడే

(||pallavi||)
yemani pŏgaḍudune yiḍuvaṁṭi nā vibhuni
yī melu ne maṟavanu yĕppuḍū nanave

(||||)
yĕṁta parāgai vuṁḍinā nĕduḍigi ne vachchide
saṁtosāna momu sūsi sanavichchune
viṁtalugā nidriṁcheveḽa nem̐ bādā lŏttide
aṁtalone lesi nannu nādariṁchune

(||||)
ye pŏddu ne vachchinānu yĕdurugŏni lāliṁchi
sebaṭṭi kaum̐giliṁchi seda dersune
sābalāna siggudonĕ samugāna nuṁḍinānu
sām̐pune sedulu nā sannula mīm̐daḍane

(||||)
yĕchchi rājasānam̐ dānu yegadāna nuṁḍinānu
machchiga nādo navvi manniṁchune
ichchaḍa śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
ichchagiṁchi nannu nelĕ yĕnnam̐ḍunum̐ bāyam̐ḍe