యేమని పొగడవచ్చు నిదివో నీ విలాసము
(॥పల్లవి॥)
యేమని పొగడవచ్చు నిదివో నీ విలాసము
కామించి నిన్నుఁ బొందిన కాంతదే భాగ్యమూ
(॥॥)
చొప్పుగా మన్నించి నీవు సుదతిఁ జూచితేను
కప్పి మోమున మదన కళలు నిండే
కొప్పు దువ్వి నీవు కొనగోరు సోకించితేను
అప్పుడే జవ్వన సామ్రాజ్యము చెలరేఁగెనూ
(॥॥)
మనసిచ్చి నీ వీకెతో మాట లాడినంతలోనే
వొనరుచుఁ గుచగిరు లుప్పొంగెనూ
పెనఁగుచు నొకమాటు ప్రియానఁ జేయి వట్టితే
పనివడి తమకపు భండారము నిండెనూ
(॥॥)
అలరి శ్రీ వేంకటేశ అలమేల్మంగఁ గూడితే
కల చక్కఁదన మెల్లాఁ గనుపట్టేనూ
నిలిచి యీవేళనే నీవు దయఁ జూచితేనూ
బలిమితో మోహన సంపద కెల్లా మించెనూ.
(||pallavi||)
yemani pŏgaḍavachchu nidivo nī vilāsamu
kāmiṁchi ninnum̐ bŏṁdina kāṁtade bhāgyamū
(||||)
sŏppugā manniṁchi nīvu sudadim̐ jūsidenu
kappi momuna madana kaḽalu niṁḍe
kŏppu duvvi nīvu kŏnagoru sogiṁchidenu
appuḍe javvana sāmrājyamu sĕlarem̐gĕnū
(||||)
manasichchi nī vīgĕdo māḍa lāḍinaṁtalone
vŏnarusum̐ gusagiru luppŏṁgĕnū
pĕnam̐gusu nŏgamāḍu priyānam̐ jeyi vaṭṭide
panivaḍi tamagabu bhaṁḍāramu niṁḍĕnū
(||||)
alari śhrī veṁkaḍeśha alamelmaṁgam̐ gūḍide
kala sakkam̐dana mĕllām̐ ganubaṭṭenū
nilisi yīveḽane nīvu dayam̐ jūsidenū
balimido mohana saṁpada kĕllā miṁchĕnū.