యేమైనా నిన్ననేనా యింతి నేఁడు
(॥పల్లవి॥)
యేమైనా నిన్ననేనా యింతి నేఁడు
చే ముంచి యింతలో నేల సిగ్గువడే వయ్యా
(॥॥)
వెలఁ ది నిను మెచ్చితే విన వేడుక గాదా
నలువంకా సొలసితే నవ్వు రాదా
తలఁ చి నీకు మొక్కితే దయ వుట్ట వలదా
చెలఁ గి యిందుకు నేల సిగ్గువడే వయ్యా
(॥॥)
సారె నిన్నుఁ జూచితేను సంతోసించఁ దగదా
చేరి మాటాడితే పొందు సేయఁ జెల్లదా
కూరిమి దెలిపి తేను గుట్టున నుండవలదా
జీరల చెక్కుల నెంత సిగ్గువడేవయ్యా
(॥॥)
కడలేక వూఁ కొంటే కతచెప్ప సందు గాదా
యెడ మిచ్చితే పండుండ నింపులు గావా
అడరి శ్రీ వేంకటేశ యలమేల్మంగఁ బెండ్లాడి
చిడిముడి నీ వెట్టు సిగ్గువడేవయ్యా
(||pallavi||)
yemainā ninnanenā yiṁti nem̐ḍu
se muṁchi yiṁtalo nela sigguvaḍe vayyā
(||||)
vĕlam̐ di ninu mĕchchide vina veḍuga gādā
naluvaṁkā sŏlaside navvu rādā
talam̐ si nīgu mŏkkide daya vuṭṭa valadā
sĕlam̐ gi yiṁdugu nela sigguvaḍe vayyā
(||||)
sārĕ ninnum̐ jūsidenu saṁtosiṁcham̐ dagadā
seri māḍāḍide pŏṁdu seyam̐ jĕlladā
kūrimi dĕlibi tenu guṭṭuna nuṁḍavaladā
jīrala sĕkkula nĕṁta sigguvaḍevayyā
(||||)
kaḍalega vūm̐ kŏṁṭe kadasĕppa saṁdu gādā
yĕḍa michchide paṁḍuṁḍa niṁpulu gāvā
aḍari śhrī veṁkaḍeśha yalamelmaṁgam̐ bĕṁḍlāḍi
siḍimuḍi nī vĕṭṭu sigguvaḍevayyā