యేమాయ నిందుకు మీ రిద్దరును జాణలే
(॥పల్లవి॥)
యేమాయ నిందుకు మీ రిద్దరును జాణలే
ప్రేమతో నెచ్చుకుందులఁ బెనఁగ నేమిటికే
(॥॥)
మనసెనసినవారు మందెమేళాన నుందురు
చనవు గలుగువారు సాదింతురు
తనవి చాలనివారు తగిలి పై కొందురు
యెన లేని నీ చేఁతల కెగ్గుపట్టఁ దగదు
(॥॥)
సమ్మతించువారు మీఱి సరసములాడుదురు
నమ్మికైన వారెంతైనా నవ్వుదురు
యెమ్మెలు లేని వారు యేమైనా నడుగుదురు
ఇమ్ముల నిందుకుఁ గాను యెగ్గుపట్టఁ దగదు
(॥॥)
కలసి వుండీన వారు కౌఁగిట బిగింతురు
వలచిన వారు గర్వాన మెత్తురు
చెలి యలమేలుమంగ శ్రీ వేంకటేశుఁడవు
యెలమిఁ గూడితి రిఁక నెగ్గుపట్టఁదగదు
(||pallavi||)
yemāya niṁdugu mī riddarunu jāṇale
premado nĕchchuguṁdulam̐ bĕnam̐ga nemiḍige
(||||)
manasĕnasinavāru maṁdĕmeḽāna nuṁduru
sanavu galuguvāru sādiṁturu
tanavi sālanivāru tagili pai kŏṁduru
yĕna leni nī sem̐tala kĕggubaṭṭam̐ dagadu
(||||)
sammadiṁchuvāru mīṟi sarasamulāḍuduru
nammigaina vārĕṁtainā navvuduru
yĕmmĕlu leni vāru yemainā naḍuguduru
immula niṁdugum̐ gānu yĕggubaṭṭam̐ dagadu
(||||)
kalasi vuṁḍīna vāru kaum̐giḍa bigiṁturu
valasina vāru garvāna mĕtturu
sĕli yalamelumaṁga śhrī veṁkaḍeśhum̐ḍavu
yĕlamim̐ gūḍidi rim̐ka nĕggubaṭṭam̐dagadu