యేలినవాఁడు తాను యే మనఁగల నేను
(॥పల్లవి॥)
యేలినవాఁడు తాను యే మనఁగల నేను
పోలించి తా నన్నూరకే పొగడీఁ గాక
(॥॥)
పంతమాడ నెంతదానఁ బలుమారుఁ దనతోను
చెంతఁదా నా చెప్పినట్టు సేసీ నని
వింతలుగా నందరితో విఱ్ఱవీఁగ నెంతదాన
కాంతుఁ దానిట్టే నాకుఁ గైవస మాయ నని
(॥॥)
సేవ సేయ నెంతదాన చెలరేఁగి చెలరేఁగి
చేవమీఱ నా బత్తి చేకొనీ నని
వేవేలైన నాసుద్దులు విన్నవించ నెంతదాన
దేవర వలెఁ దా విని తెలిసి మెచ్చీ నని
(॥॥)
పెనగఁ నెంతదాన ప్రియముతోఁ దనతోడ
ననుపునఁ దా నాతో నవ్వీ నని
యెనసి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
పనిగొన నెంతదాన బడిఁ దా నున్నాఁ డని
(||pallavi||)
yelinavām̐ḍu tānu ye manam̐gala nenu
poliṁchi tā nannūrage pŏgaḍīm̐ gāga
(||||)
paṁtamāḍa nĕṁtadānam̐ balumārum̐ danadonu
sĕṁtam̐dā nā sĕppinaṭṭu sesī nani
viṁtalugā naṁdarido viṭravīm̐ga nĕṁtadāna
kāṁtum̐ dāniṭṭe nāgum̐ gaivasa māya nani
(||||)
seva seya nĕṁtadāna sĕlarem̐gi sĕlarem̐gi
sevamīṟa nā batti segŏnī nani
vevelaina nāsuddulu vinnaviṁcha nĕṁtadāna
devara valĕm̐ dā vini tĕlisi mĕchchī nani
(||||)
pĕnagam̐ nĕṁtadāna priyamudom̐ danadoḍa
nanubunam̐ dā nādo navvī nani
yĕnasi śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
panigŏna nĕṁtadāna baḍim̐ dā nunnām̐ ḍani