Yele naagu vegiramu yimka nemidigi simta

యేలే నాకు వేగిరము యింక నేమిటికి చింత
Language

(॥పల్లవి॥)
యేలే నాకు వేగిరము యింక నేమిటికి చింత
తాలిమి నాతఁడే నాకు దక్కి వుండీఁ గాకా

(॥॥)
ప్రియ మెంత గలిగినఁ బిలువక వత్తురా
నయముగల దంటాను నవ్వ వచ్చునా
క్రియ యెఱిఁగినయట్టి కిమ్ముల యిల్లాలికి
దయగలదాఁకా పతిఁ దగులుట గాకా

(॥॥)
బలి మెంత గలిగినాఁ బైకొనఁగ వచ్చునా
చల మీడేరీ నంటాను జంకింతురా
కుల కాంతలకుఁ దమ గుణముతోనే పతి
తలఁపులో మెలఁగుటే తగ వింతే కాకా

(॥॥)
మన్నించి యెంత గూడినా మందెమేలము చెల్లునా
మున్నిటి సుద్దులు నేడు మొనసేతురా
యన్నిటా శ్రీ వేంకటేశుఁ డిప్పుడిట్టే నన్నుఁగూడె
కన్నెనైన నా కితఁడే గతి యంట గాకా.

(||pallavi||)
yele nāgu vegiramu yiṁka nemiḍigi siṁta
tālimi nādam̐ḍe nāgu dakki vuṁḍīm̐ gāgā

(||||)
priya mĕṁta galiginam̐ biluvaga vatturā
nayamugala daṁṭānu navva vachchunā
kriya yĕṟim̐ginayaṭṭi kimmula yillāligi
dayagaladām̐kā padim̐ daguluḍa gāgā

(||||)
bali mĕṁta galiginām̐ baigŏnam̐ga vachchunā
sala mīḍerī naṁṭānu jaṁkiṁturā
kula kāṁtalagum̐ dama guṇamudone padi
talam̐pulo mĕlam̐guḍe taga viṁte kāgā

(||||)
manniṁchi yĕṁta gūḍinā maṁdĕmelamu sĕllunā
munniḍi suddulu neḍu mŏnasedurā
yanniḍā śhrī veṁkaḍeśhum̐ ḍippuḍiṭṭe nannum̐gūḍĕ
kannĕnaina nā kidam̐ḍe gadi yaṁṭa gāgā.