యేల వొట్లు వెట్టేవు యెంత వేగిరించేవు
(॥పల్లవి॥)
యేల వొట్లు వెట్టేవు యెంత వేగిరించేవు
యేలికవైతే నేమి యింత గద్దా నగవూ
(॥॥)
అలిగి వేఁడుకొని ఆదరించవలెఁ గాని
చలానఁ బెనఁగ నేల సతి తోను
పలుక కుండితే నొడఁబరచఁగవలెఁ గాని
బలిమిఁ గొంగు వట్టితేఁ బంతము వచ్చీనా
(॥॥)
చింతఁ దలవంచు కొంటే చెక్కు నొక్కవలెఁ గాని
యింత నేరుపులు చెప్ప నేల యీకెతో
పొంతఁ గన్నీరు నించితే బుజ్జగించవలెఁ గాని
యెంత బుద్దులు చెప్పినా నియ్యకోలయ్యీనా
(॥॥)
కడు నుసురంటేను కౌఁగిలించవలెఁ గాని
వొడివట్టి తియ్య నేల వూర కీకెను
విడె మిచ్చి యింతలో శ్రీ వేంకటేశ కూడితివి
బడివాసి వుండితేను బత్తి వెలి తయ్యీనా
(||pallavi||)
yela vŏṭlu vĕṭṭevu yĕṁta vegiriṁchevu
yeligavaide nemi yiṁta gaddā nagavū
(||||)
aligi vem̐ḍugŏni ādariṁchavalĕm̐ gāni
salānam̐ bĕnam̐ga nela sadi tonu
paluga kuṁḍide nŏḍam̐barasam̐gavalĕm̐ gāni
balimim̐ gŏṁgu vaṭṭidem̐ baṁtamu vachchīnā
(||||)
siṁtam̐ dalavaṁchu kŏṁṭe sĕkku nŏkkavalĕm̐ gāni
yiṁta nerubulu sĕppa nela yīgĕdo
pŏṁtam̐ gannīru niṁchide bujjagiṁchavalĕm̐ gāni
yĕṁta buddulu sĕppinā niyyagolayyīnā
(||||)
kaḍu nusuraṁṭenu kaum̐giliṁchavalĕm̐ gāni
vŏḍivaṭṭi tiyya nela vūra kīgĕnu
viḍĕ michchi yiṁtalo śhrī veṁkaḍeśha kūḍidivi
baḍivāsi vuṁḍidenu batti vĕli tayyīnā