Yela tappimchugonevu yiyyagoraadaa

యేల తప్పించుకొనేవు యియ్యకోరాదా
Language

(॥పల్లవి॥)
యేల తప్పించుకొనేవు యియ్యకోరాదా
వాలాయించిన పనులు వద్దనఁగ వచ్చునా

(॥॥)
మచ్చికైన సతి నిన్ను మలసి కౌఁగిలించితే
యిచ్చగించవలెఁ గాని యెడయరాదు
రచ్చఁబడ్డ వలపులు రమణ నణఁగునా
తచ్చి కస్తూరి పూసితే దాఁగునా వాసనలు

(॥॥)
వేడుక కత్తెయైనది వీడెము చేతి కిచ్చితే
తోడనే యందుట గాని తొలఁగరాదు
కూడిన తొల్లిటి పొందు గూఁటఁ బెట్టితే నుండునా
నీడగా మొయిలు వచ్చితే నీవు దొబ్బఁ గలవా

(॥॥)
కలికియైనది నీపై గక్కన సేస వెట్టితే
పిలిచి యలమి యిఁకఁ బెనఁగరాదు
అలమేలుమంగ పతివైన శ్రీ వేంకటేశ్వర
యిల మేన వారి వావి యెంతైనాఁ బాసునా.

(||pallavi||)
yela tappiṁchugŏnevu yiyyagorādā
vālāyiṁchina panulu vaddanam̐ga vachchunā

(||||)
machchigaina sadi ninnu malasi kaum̐giliṁchide
yichchagiṁchavalĕm̐ gāni yĕḍayarādu
rachcham̐baḍḍa valabulu ramaṇa naṇam̐gunā
tachchi kastūri pūside dām̐gunā vāsanalu

(||||)
veḍuga kattĕyainadi vīḍĕmu sedi kichchide
toḍane yaṁduḍa gāni tŏlam̐garādu
kūḍina tŏlliḍi pŏṁdu gūm̐ṭam̐ bĕṭṭide nuṁḍunā
nīḍagā mŏyilu vachchide nīvu dŏbbam̐ galavā

(||||)
kaligiyainadi nībai gakkana sesa vĕṭṭide
pilisi yalami yim̐kam̐ bĕnam̐garādu
alamelumaṁga padivaina śhrī veṁkaḍeśhvara
yila mena vāri vāvi yĕṁtainām̐ bāsunā.