Yela saare garisimche vimtini neevu

యేల సారె గరిసించే వింతిని నీవు
Language

(॥పల్లవి॥)
యేల సారె గరిసించే వింతిని నీవు
తాలిమి నీ తగవులు తగ నీ వెఱుఁగవా

(॥॥)
చలపట్ట రాదుగాని సతులకు నీ మీఁద
వలపులఁ గొసరఁగ వచ్చు నెంతైనా
అలుగఁగరాదు గాని ఆసపడి నీతోను
సొలసి మచ్చికలెల్లాఁ జూపఁగవచ్చును

(॥॥)
బిగియఁగ రాదు గాని పెనఁగి పెనఁగి నీకు
మొగము చూపి చూపి మొక్కవచ్చును
జగడించరాదుగాని చనవు మెఱసి నీతో
నగి సరసములాడి నంటు చూపవచ్చును

(॥॥)
పంతమాడరాదుగాని భావ మెఱిఁగి నిన్ను
చెంతల గుబ్బల నొత్తి చెందవచ్చును
యింతటా శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
సంతసానఁ గూడి మోవి చవి చూడవచ్చును

(||pallavi||)
yela sārĕ garisiṁche viṁtini nīvu
tālimi nī tagavulu taga nī vĕṟum̐gavā

(||||)
salabaṭṭa rādugāni sadulagu nī mīm̐da
valabulam̐ gŏsaram̐ga vachchu nĕṁtainā
alugam̐garādu gāni āsabaḍi nīdonu
sŏlasi machchigalĕllām̐ jūbam̐gavachchunu

(||||)
bigiyam̐ga rādu gāni pĕnam̐gi pĕnam̐gi nīgu
mŏgamu sūbi sūbi mŏkkavachchunu
jagaḍiṁcharādugāni sanavu mĕṟasi nīdo
nagi sarasamulāḍi naṁṭu sūbavachchunu

(||||)
paṁtamāḍarādugāni bhāva mĕṟim̐gi ninnu
sĕṁtala gubbala nŏtti sĕṁdavachchunu
yiṁtaḍā śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
saṁtasānam̐ gūḍi movi savi sūḍavachchunu