యేల రట్టు సేసుకొనే విందరిలో నీకు నీవే
(॥పల్లవి॥)
యేల రట్టు సేసుకొనే విందరిలో నీకు నీవే
ఆలరి నీ చేఁతలు నే నాడుకొనవచ్చునా
(॥॥)
మోము చూచితే నవ్వేవు మొదల నెవ్వతెవద్ద
యేమేమి సేసితివో యెఱఁగ నేను
చేముంచి ప్రియము లెల్లాఁ జెప్పే వప్పటినాకు
నీ మనసులో సుద్దులు నీకే తెలుసును
(॥॥)
మొక్కితే సిగ్గు వడేవు ముచ్చిలి యే వనితకు
అక్కడఁ బెండ్లికొడుకవై వచ్చితివో
చెక్కు నొక్కి వేఁడుకొని చేరి నన్నుఁ దగిలేవు
నిక్కపు నీ గుణములు నీకే తెలుసును
(॥॥)
వట్టి తేనే యలికేవు పై పై నే సతిగురుతు
లిట్టే నీ మేనిమీఁద నెన్ని యున్నవో
అట్టే శ్రీ వేంకటేశ అలమేలు మంగ నేను
నెట్టు కొని కూడితివి నీకే తెలుసునూ.
(||pallavi||)
yela raṭṭu sesugŏne viṁdarilo nīgu nīve
ālari nī sem̐talu ne nāḍugŏnavachchunā
(||||)
momu sūside navvevu mŏdala nĕvvadĕvadda
yememi sesidivo yĕṟam̐ga nenu
semuṁchi priyamu lĕllām̐ jĕppe vappaḍināgu
nī manasulo suddulu nīge tĕlusunu
(||||)
mŏkkide siggu vaḍevu muchchili ye vanidagu
akkaḍam̐ bĕṁḍligŏḍugavai vachchidivo
sĕkku nŏkki vem̐ḍugŏni seri nannum̐ dagilevu
nikkabu nī guṇamulu nīge tĕlusunu
(||||)
vaṭṭi tene yaligevu pai pai ne sadigurudu
liṭṭe nī menimīm̐da nĕnni yunnavo
aṭṭe śhrī veṁkaḍeśha alamelu maṁga nenu
nĕṭṭu kŏni kūḍidivi nīge tĕlusunū.