యేల పెంచేవు చలము లెందాఁకాను
(॥పల్లవి॥)
యేల పెంచేవు చలము లెందాఁకాను
వేళ గాచుకున్నాఁడు విన్నవించఁగదవే
(॥॥)
నవ్విన మాటకుఁగాను నాతి నీ వతని నింత
రవ్వలు సేతు రటవే రచ్చలోననూ
పువ్వులు చేతి కిచ్చేవు పుప్పొడి నీ మీఁదఁ జల్లె
మవ్వపు నీ పతి తోడ మంచి మాటలాడవే
(॥॥)
సరస మాడినందుకే చెండిపెట్టి యతనితో
జరసి జంకింతురటే సముకాననూ
గరిమ నిన్నుఁబొగడి గందము మైనిండాఁబూసె
బెరసి యాతని కింకాఁ బ్రియములు చెప్పవే
(॥॥)
కూరిమిఁ గూడినందుకే కోరి శ్రీ వేంకటేశ్వరు
నా రీతి నాడుదురటే అంతరంగాన
హారము నీ మెడఁబెట్టే నాకు మడిచి నీకిచ్చె
గారవించితని నిట్టే కందువఁ బాయకువే
(||pallavi||)
yela pĕṁchevu salamu lĕṁdām̐kānu
veḽa gāsugunnām̐ḍu vinnaviṁcham̐gadave
(||||)
navvina māḍagum̐gānu nādi nī vadani niṁta
ravvalu sedu raḍave rachchalonanū
puvvulu sedi kichchevu puppŏḍi nī mīm̐dam̐ jallĕ
mavvabu nī padi toḍa maṁchi māḍalāḍave
(||||)
sarasa māḍinaṁduge sĕṁḍibĕṭṭi yadanido
jarasi jaṁkiṁturaḍe samugānanū
garima ninnum̐bŏgaḍi gaṁdamu mainiṁḍām̐būsĕ
bĕrasi yādani kiṁkām̐ briyamulu sĕppave
(||||)
kūrimim̐ gūḍinaṁduge kori śhrī veṁkaḍeśhvaru
nā rīdi nāḍuduraḍe aṁtaraṁgāna
hāramu nī mĕḍam̐bĕṭṭe nāgu maḍisi nīgichchĕ
gāraviṁchidani niṭṭe kaṁduvam̐ bāyaguve