యేల నీవు వెరచేవు యింతలోనను
(॥పల్లవి॥)
యేల నీవు వెరచేవు యింతలోనను
కోలు ముందాయఁ బనులు కొంక నేఁటి కయ్యా
(॥॥)
యేకతాన మీ రుండఁగా నెఱఁగక వచ్చితిని
వాకిట నుండే నన్ను వద్దనకుమీ
రాకుండీ నే నీచేతి రవ్వలఁ బడఁగ రాదు
నీ కతలు చెప్పఁబోతే నివ్వెరగు లయ్యా
(॥॥)
మాటలు మీ రాడుకోఁ గా మరచి గక్కన వింటి
నాఁటదాన మగుడ న న్నడుగకుమీ
నీటున నే నూరకున్న నిండుగర్వి నే ననేవు
యేఁటికిఁ గొసర నీ మేలిటువంటి దయ్యా
(॥॥)
కూడిన మీ కూటముల గురుతు గక్కనఁ గంటి
వీడె మిచ్చి సిగ్గువడి వీఁగకుమీ
యీడనె శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
పాడిఁ బంతములు నీవే పనిగొంటి వయ్యా
(||pallavi||)
yela nīvu vĕrasevu yiṁtalonanu
kolu muṁdāyam̐ banulu kŏṁka nem̐ṭi kayyā
(||||)
yegadāna mī ruṁḍam̐gā nĕṟam̐gaga vachchidini
vāgiḍa nuṁḍe nannu vaddanagumī
rāguṁḍī ne nīsedi ravvalam̐ baḍam̐ga rādu
nī kadalu sĕppam̐bode nivvĕragu layyā
(||||)
māḍalu mī rāḍugom̐ gā marasi gakkana viṁṭi
nām̐ṭadāna maguḍa na nnaḍugagumī
nīḍuna ne nūragunna niṁḍugarvi ne nanevu
yem̐ṭigim̐ gŏsara nī meliḍuvaṁṭi dayyā
(||||)
kūḍina mī kūḍamula gurudu gakkanam̐ gaṁṭi
vīḍĕ michchi sigguvaḍi vīm̐gagumī
yīḍanĕ śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
pāḍim̐ baṁtamulu nīve panigŏṁṭi vayyā