యేల నన్నుఁ బొగడీని యింతకూ నే గుఱుతంటా
(॥పల్లవి॥)
యేల నన్నుఁ బొగడీని యింతకూ నే గుఱుతంటా
తాలిమి చేఁతల కెల్లాఁ దానే గుఱుతు
(॥॥)
చక్కఁదనమున కెల్లా జవ్వనమే గుఱుతు
మక్కువల కెల్లాను మనసే గుఱుతు
తక్కిన పనుల కెల్లా తనువే గుఱుతు
జక్కవ పిట్టలఁ బోల్చ చన్నులే గుఱుతు
(॥॥)
మానరాని చేఁతలకు మంచితనాలే గుఱుతు
వూనిన సిగ్గుల కెల్లా నోరచూపే గుఱుతు
సేసలైన యాసలకు చేతి మొక్కులే గుఱుతు
నా నా సంతోసాలకు నవ్వులే గుఱుతు
(॥॥)
వుడివోని వలపుల కొడఁ బాట్లే గుఱుతు
యెడయని కూటముల కిచ్చకములే గుఱుతు
అడరి శ్రీ వేంకటేశుఁడట్టే నన్ను నేలినాఁడు
తడయని భోగాలకు తమకమే గుఱుతు
(||pallavi||)
yela nannum̐ bŏgaḍīni yiṁtagū ne guṟudaṁṭā
tālimi sem̐tala kĕllām̐ dāne guṟudu
(||||)
sakkam̐danamuna kĕllā javvaname guṟudu
makkuvala kĕllānu manase guṟudu
takkina panula kĕllā tanuve guṟudu
jakkava piṭṭalam̐ bolsa sannule guṟudu
(||||)
mānarāni sem̐talagu maṁchidanāle guṟudu
vūnina siggula kĕllā norasūbe guṟudu
sesalaina yāsalagu sedi mŏkkule guṟudu
nā nā saṁtosālagu navvule guṟudu
(||||)
vuḍivoni valabula kŏḍam̐ bāṭle guṟudu
yĕḍayani kūḍamula kichchagamule guṟudu
aḍari śhrī veṁkaḍeśhum̐ḍaṭṭe nannu nelinām̐ḍu
taḍayani bhogālagu tamagame guṟudu