యేల మమ్ము వేఁడుకొనే వెంత ఱట్టు సేసేవు
(॥పల్లవి॥)
యేల మమ్ము వేఁడుకొనే వెంత ఱట్టు సేసేవు
వాలాయించి నీ చేతిలో వార మింతే నేము
(॥॥)
చలముతో వారమా సాదించేవారమా నీపై
వలపులు చల్లేటి వారము గాక
పలుకకుండఁ గలమా పాసి వుండఁగలమా నీ
తలఁపు లోనే మెలఁగి తగిలేము గాక
(॥॥)
కొసరేటి వారమా గుంపించే వారమా
వసమై నీ సేవ సేసే వారము గాకా
విసిగేమా నీ తోను వేడుకకు లోఁగేమా
సుసరాన నీ యిచ్చలోఁ జొక్కేము గాకా
(॥॥)
గరిసించే వారమా కాంతాళించే వారమా
వరుస నీ దేవుళ్ళలో వారము గాక
యిరవై శ్రీ వేంకటేశ యేలితివి మమ్ము నిట్టే
పొరిఁ బొరి నీ గుణాలు పొగడేము గాకా
(||pallavi||)
yela mammu vem̐ḍugŏne vĕṁta ṟaṭṭu sesevu
vālāyiṁchi nī sedilo vāra miṁte nemu
(||||)
salamudo vāramā sādiṁchevāramā nībai
valabulu salleḍi vāramu gāga
palugaguṁḍam̐ galamā pāsi vuṁḍam̐galamā nī
talam̐pu lone mĕlam̐gi tagilemu gāga
(||||)
kŏsareḍi vāramā guṁpiṁche vāramā
vasamai nī seva sese vāramu gāgā
visigemā nī tonu veḍugagu lom̐gemā
susarāna nī yichchalom̐ jŏkkemu gāgā
(||||)
garisiṁche vāramā kāṁtāḽiṁche vāramā
varusa nī devuḽḽalo vāramu gāga
yiravai śhrī veṁkaḍeśha yelidivi mammu niṭṭe
pŏrim̐ bŏri nī guṇālu pŏgaḍemu gāgā