యేల మమ్ము రేఁచేవు యేమనవచ్చును నిన్ను
(॥పల్లవి॥)
యేల మమ్ము రేఁచేవు యేమనవచ్చును నిన్ను
యేలుకొందువు గాని మా యింటికి రావయ్యా
(॥॥)
వాకుచ్చి నీతో నేను వక్కణగా మాటాడఁగా
నీకు దేవులై నవారు ని న్నేమందురో
మేకులకు నీతో నేను మేలములాడఁ గాను
కాకరి తనాల నవ్వి కమ్మటి సాదింతురో
(॥॥)
చేతులు చాఁచి నీకు సేవలు నేఁ జేయఁగాను
నీ తగులు గలవారు ని న్నేమందురో
కాతరించి నీ మొగమే కనుపెట్టి చూడఁగాను
యేతులకు జంకించి యెంత ఱట్టు సేతురో
(॥॥)
గట్టి నా చన్నుల నొత్తి కౌఁగిట బిగించఁగాను
నెట్టన నీ యింటివారు నిన్నేమందురో
ఇట్టే శ్రీ వేంకటేశ యేలితివి నన్నింతలో
దిట్టతనముల వారెంతేసి చెనకుదురో
(||pallavi||)
yela mammu rem̐sevu yemanavachchunu ninnu
yelugŏṁduvu gāni mā yiṁṭigi rāvayyā
(||||)
vāguchchi nīdo nenu vakkaṇagā māḍāḍam̐gā
nīgu devulai navāru ni nnemaṁduro
megulagu nīdo nenu melamulāḍam̐ gānu
kāgari tanāla navvi kammaḍi sādiṁturo
(||||)
sedulu sām̐si nīgu sevalu nem̐ jeyam̐gānu
nī tagulu galavāru ni nnemaṁduro
kādariṁchi nī mŏgame kanubĕṭṭi sūḍam̐gānu
yedulagu jaṁkiṁchi yĕṁta ṟaṭṭu seduro
(||||)
gaṭṭi nā sannula nŏtti kaum̐giḍa bigiṁcham̐gānu
nĕṭṭana nī yiṁṭivāru ninnemaṁduro
iṭṭe śhrī veṁkaḍeśha yelidivi nanniṁtalo
diṭṭadanamula vārĕṁtesi sĕnaguduro