Yela mammu rattu sese vimdarilona

యేల మమ్ము రట్టు సేసే విందరిలోన
Language

(॥పల్లవి॥)
యేల మమ్ము రట్టు సేసే విందరిలోన
యేలాగులఁ బెనఁగినా నిది గబ్బియనరా

(॥॥)
పందేలాడు మనేవు నీ పైఁ జేయి వేసితే
మందె మేళమై యుండదా మరి చూచితే
చందముగ వాటు వేసి సారెలు నేఁదాకించితే
యిందుకు నీ పడఁతులు యెంత నిష్టూఁరనరా

(॥॥)
తమ్ములము జూజానకు తగ నొడ్డు వెట్టేవు
యెమ్మె లాడే ననరా యిందరు నన్ను
నెమ్మది నే గెలిచాట నీపై నే మోపితేను
కమ్మర సవతులెల్ల కడుఱాఁగ యనరా

(॥॥)
గుబ్బలు నీ సారె లంటాఁగూడి పట్టేవౌనంటే
వుబ్బరికత్తె యనుచు నుప్పటించరా
యెబ్బిడేల శ్రీ వేంకటేశ యలమేల్మంగను
అబ్బురాన నన్నేలితి పతిజాణ ననరా

(||pallavi||)
yela mammu raṭṭu sese viṁdarilona
yelāgulam̐ bĕnam̐ginā nidi gabbiyanarā

(||||)
paṁdelāḍu manevu nī paim̐ jeyi veside
maṁdĕ meḽamai yuṁḍadā mari sūside
saṁdamuga vāḍu vesi sārĕlu nem̐dāgiṁchide
yiṁdugu nī paḍam̐tulu yĕṁta niṣhṭūm̐ranarā

(||||)
tammulamu jūjānagu taga nŏḍḍu vĕṭṭevu
yĕmmĕ lāḍe nanarā yiṁdaru nannu
nĕmmadi ne gĕlisāḍa nībai ne mobidenu
kammara savadulĕlla kaḍuṟām̐ga yanarā

(||||)
gubbalu nī sārĕ laṁṭām̐gūḍi paṭṭevaunaṁṭe
vubbarigattĕ yanusu nuppaḍiṁcharā
yĕbbiḍela śhrī veṁkaḍeśha yalamelmaṁganu
abburāna nannelidi padijāṇa nanarā