యేల మాతో నీడువెట్టే వెవ్వరినైనా
(॥పల్లవి॥)
యేల మాతో నీడువెట్టే వెవ్వరినైనా
గాలి ముడియ గట్టితే గట్టి పడీనా
(॥॥)
కలువల వేసేవారు కాఁకలు చల్లేవారు
యెలమి నీకుఁ జుట్టా లెందరులేరు
తలఁబాలు వోసిన తరుణులే గుఱిగాఁగఁ
దెలిపి చెప్పేయట్టి దేవుళ్ళు గాకా
(॥॥)
పొందులు సేసేవారు పొద్దులు వుచ్చేవారు
యిందు నందు వెదకితే నెందరు లేరు
కందువ సమ్మంధపు కలయిక గుఱిగాఁగ
నందముగఁ జెప్పె వారాండ్లు గాకా
(॥॥)
సారెకు నవ్వేవారు సరస మాడేటివారు
యీరీతి శ్రీ వేంకటేశ యెందరు లేరు
మేరఁ గంకణదారాల మెలఁతలే గుఱిగాఁగ
కోరి వేడి చెప్పే పెండ్లికూఁతులు గాకా
(||pallavi||)
yela mādo nīḍuvĕṭṭe vĕvvarinainā
gāli muḍiya gaṭṭide gaṭṭi paḍīnā
(||||)
kaluvala vesevāru kām̐kalu sallevāru
yĕlami nīgum̐ juṭṭā lĕṁdaruleru
talam̐bālu vosina taruṇule guṟigām̐gam̐
dĕlibi sĕppeyaṭṭi devuḽḽu gāgā
(||||)
pŏṁdulu sesevāru pŏddulu vuchchevāru
yiṁdu naṁdu vĕdagide nĕṁdaru leru
kaṁduva sammaṁdhabu kalayiga guṟigām̐ga
naṁdamugam̐ jĕppĕ vārāṁḍlu gāgā
(||||)
sārĕgu navvevāru sarasa māḍeḍivāru
yīrīdi śhrī veṁkaḍeśha yĕṁdaru leru
meram̐ gaṁkaṇadārāla mĕlam̐tale guṟigām̐ga
kori veḍi sĕppe pĕṁḍligūm̐tulu gāgā