యేల బూటకాలు సేసీ యింటికి రమ్మనవే
(॥పల్లవి॥)
యేల బూటకాలు సేసీ యింటికి రమ్మనవే
చాలఁ దల దడిసితే చలి వాసు ననవే
(॥॥)
ఆపెకు లోఁగేవాఁడు అనుమానించేవాఁడు
చేపట్టి నాఁడేల నాకు సేస వెట్టే నే
పై పై సన్న సేసేవాఁడు పరాకు చుపేవాఁడు
వోపికతోఁ దన వేలి వుంగర మేలంపెనే
(॥॥)
యింత మొగమోటవాఁడు ఇంతికి వెరచే వాఁడు
రంతుల నా వలపేల రచ్చఁబెట్టే నే
మంతనపు మాటవాఁడు మరి గుట్టు తోడివాఁడు
వింతలే కతగఁ బెండ్లి వీడే లెట్టు వెట్టే నే
(॥॥)
సెలవి నవ్వేవాఁడు సిగ్గులు వడేవాఁడు
కలసి నన్నేటువలెఁ గౌఁగిలించెనే
యెలమి శ్రీ వేంకటేశుఁడిందరి నేలినవాఁడు
కలసి మాలోన నొక్కటి యెట్టు సేసెనే
(||pallavi||)
yela būḍagālu sesī yiṁṭigi rammanave
sālam̐ dala daḍiside sali vāsu nanave
(||||)
ābĕgu lom̐gevām̐ḍu anumāniṁchevām̐ḍu
sebaṭṭi nām̐ḍela nāgu sesa vĕṭṭe ne
pai pai sanna sesevām̐ḍu parāgu subevām̐ḍu
vobigadom̐ dana veli vuṁgara melaṁpĕne
(||||)
yiṁta mŏgamoḍavām̐ḍu iṁtigi vĕrase vām̐ḍu
raṁtula nā valabela rachcham̐bĕṭṭe ne
maṁtanabu māḍavām̐ḍu mari guṭṭu toḍivām̐ḍu
viṁtale kadagam̐ bĕṁḍli vīḍe lĕṭṭu vĕṭṭe ne
(||||)
sĕlavi navvevām̐ḍu siggulu vaḍevām̐ḍu
kalasi nanneḍuvalĕm̐ gaum̐giliṁchĕne
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍiṁdari nelinavām̐ḍu
kalasi mālona nŏkkaḍi yĕṭṭu sesĕne