Yela baya leemdimchere yimtulaala

యేల బయ లీఁదించేరే యింతులాల
Language

(॥పల్లవి॥)
యేల బయ లీఁదించేరే యింతులాల
మేలిమి బత్తి గలిగితే మీ రాతనిఁ దేరే

(॥॥)
తప్పక చూచినాను తనివోని యాసలు
వొప్పుగ నెడ మాటల నూరడిలీనా
ముప్పిరి నెడ మాటల ముంచుకొన్న వేడుక
చప్పు డాలించి నంతలోఁ జాలఁబోయీనా

(॥॥)
సరసము లాడినాను జడియని వలపులు
తెరమాఁటు సన్నలనుఁ దీర్చవచ్చీనా
నిరతపు సన్నల నిండు కొన్నకోరికెలు
గరిమ నవ్వినంతనే కాఁక వాపీనా

(॥॥)
కాయముఁ గాయముఁ గూడి కడివోని తమకము
చేయెత్తి సేసవెట్టి తే సెలవయ్యీనా
యీ యెడ శ్రీ వేంకటేశుఁ డే నలమేలుమంగను
చాయకు వచ్చి నన్నేలె జంట వాసీనా

(||pallavi||)
yela baya līm̐diṁchere yiṁtulāla
melimi batti galigide mī rādanim̐ dere

(||||)
tappaga sūsinānu tanivoni yāsalu
vŏppuga nĕḍa māḍala nūraḍilīnā
muppiri nĕḍa māḍala muṁchugŏnna veḍuga
sappu ḍāliṁchi naṁtalom̐ jālam̐boyīnā

(||||)
sarasamu lāḍinānu jaḍiyani valabulu
tĕramām̐ṭu sannalanum̐ dīrsavachchīnā
niradabu sannala niṁḍu kŏnnagorigĕlu
garima navvinaṁtane kām̐ka vābīnā

(||||)
kāyamum̐ gāyamum̐ gūḍi kaḍivoni tamagamu
seyĕtti sesavĕṭṭi te sĕlavayyīnā
yī yĕḍa śhrī veṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
sāyagu vachchi nannelĕ jaṁṭa vāsīnā