యెక్కడి కెక్కడ వల పెందెందు మోచివున్నది
(॥పల్లవి॥)
యెక్కడి కెక్కడ వల పెందెందు మోచివున్నది
చొక్కపు వేడుక లివి చూడరమ్మ చెలులూ
(॥॥)
చనుఁగొండల నడుమఁ జంద్రోదయ మాయ
వెనకఁ జెక్కులవెంట వెన్నెల గాసే
మునుకొని ఇందరము మొగములు చూచుకొంటే
తన కేల సిగ్గువడఁ దరుణికినీ
(॥॥)
దొరసి మోముఁ దమ్మిపై తుమ్మెదలు చెలరేఁగే
గరిమ ముక్కునఁ దావిగాలి విసరే
అరు దందె మన లోన నందుకుఁ గా మెచ్చితేను
సిర వంచుకో నేలే చెలియకును
(॥॥)
వావిరి మెఱుఁగు మేన వానలు గురియఁ జొచ్చె
శ్రీ వేంకటేశుఁ డింతలోఁ జేరి కూడెను
యీ వేళఁ దమ కిందర మితవులు నెరపితే
భావించి చూడఁగ నేల పడఁతికిని
(||pallavi||)
yĕkkaḍi kĕkkaḍa vala pĕṁdĕṁdu mosivunnadi
sŏkkabu veḍuga livi sūḍaramma sĕlulū
(||||)
sanum̐gŏṁḍala naḍumam̐ jaṁdrodaya māya
vĕnagam̐ jĕkkulavĕṁṭa vĕnnĕla gāse
munugŏni iṁdaramu mŏgamulu sūsugŏṁṭe
tana kela sigguvaḍam̐ daruṇiginī
(||||)
dŏrasi momum̐ dammibai tummĕdalu sĕlarem̐ge
garima mukkunam̐ dāvigāli visare
aru daṁdĕ mana lona naṁdugum̐ gā mĕchchidenu
sira vaṁchugo nele sĕliyagunu
(||||)
vāviri mĕṟum̐gu mena vānalu guriyam̐ jŏchchĕ
śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalom̐ jeri kūḍĕnu
yī veḽam̐ dama kiṁdara midavulu nĕrabide
bhāviṁchi sūḍam̐ga nela paḍam̐tigini