Yekkadaudaa neṟamgavu yidivo neevaidenu

యెక్కడౌతా నెఱఁగవు యిదివో నీవైతేను
Language

(॥పల్లవి॥)
యెక్కడౌతా నెఱఁగవు యిదివో నీవైతేను
చక్కదిద్దుకొనవమ్మ సమరతి చిహ్నాలు

(॥॥)
సరులు చన్నుల మీఁదఁజల్లు వెదలాడఁగాను
విరులు కొప్పున నుండి వెస రాలఁగా
వొరసి నీ పతి వద్ద నుండి నీవు రాఁగాను
తరుణులు నిన్నుఁ జూచి తమలో నవ్వేరు

(॥॥)
చెక్కుల వెంటాను పెంజెమటలు గారఁగాను
ముక్కున నిట్టూర్పులు ముంచఁగాను
నెక్కొన రతి నోలాడీ నీడ చూచుకొనఁగాను
చక్కఁజూచి సతులెల్లా సన్నసేసుకొనేరు

(॥॥)
కన్నులను చెంగావి కడుఁ దలుకొత్తఁగాను
పన్నుగఁ గళలు మోముపైఁ దేరఁగా
యిన్నిటా శ్రీ వేంకటేశ నెనసి నీ వుండఁగాను
కన్నె లెల్లాఁ జూచి నీ గతులాడుకొనేరు

(||pallavi||)
yĕkkaḍaudā nĕṟam̐gavu yidivo nīvaidenu
sakkadiddugŏnavamma samaradi sihnālu

(||||)
sarulu sannula mīm̐dam̐jallu vĕdalāḍam̐gānu
virulu kŏppuna nuṁḍi vĕsa rālam̐gā
vŏrasi nī padi vadda nuṁḍi nīvu rām̐gānu
taruṇulu ninnum̐ jūsi tamalo navveru

(||||)
sĕkkula vĕṁṭānu pĕṁjĕmaḍalu gāram̐gānu
mukkuna niṭṭūrbulu muṁcham̐gānu
nĕkkŏna radi nolāḍī nīḍa sūsugŏnam̐gānu
sakkam̐jūsi sadulĕllā sannasesugŏneru

(||||)
kannulanu sĕṁgāvi kaḍum̐ dalugŏttam̐gānu
pannugam̐ gaḽalu momubaim̐ deram̐gā
yinniḍā śhrī veṁkaḍeśha nĕnasi nī vuṁḍam̐gānu
kannĕ lĕllām̐ jūsi nī gadulāḍugŏneru