యెక్కడనైనాఁ జేయి యెకసక్యాలు
(॥పల్లవి॥)
యెక్కడనైనాఁ జేయి యెకసక్యాలు
తక్కినవారి తోడ తచ్చన లెంచకయ్యా
(॥॥)
చెక్కులు గిల్లకు నన్నుఁజేరి వేడుకొనే నంటా
నక్కడ నుండే సరసమాడుదు గాక
నిక్కము నే నెఱఁ గనా నీ మతకము లిన్నియు
మొక్కేము నీకు మాతో మొఱఁ గు లేటి కయ్యా
(॥॥)
చెలఁ గి తిట్ట కు మమ్ము చెవిలో మాటాడే నంటా
సొలసి యెమ్మె లెందైనాఁ జూపుదు గాని
యెలమి నీ కపటము లెప్పుడుఁ గలవే కావా
పిలువకు మయ్య నీతోఁ బెనఁగ నోప మయ్యా
(॥॥)
కడు నన్నలయించకు కౌఁ గిటఁ గూడే నంటా
వుడివోని పూవువలె నుందువు గాని
అడరి శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
తడవి కూడితి మాతోఁ దమక మేఁటి కయ్యా
(||pallavi||)
yĕkkaḍanainām̐ jeyi yĕgasakyālu
takkinavāri toḍa tachchana lĕṁchagayyā
(||||)
sĕkkulu gillagu nannum̐jeri veḍugŏne naṁṭā
nakkaḍa nuṁḍe sarasamāḍudu gāga
nikkamu ne nĕṟam̐ ganā nī madagamu linniyu
mŏkkemu nīgu mādo mŏṟam̐ gu leḍi kayyā
(||||)
sĕlam̐ gi tiṭṭa ku mammu sĕvilo māḍāḍe naṁṭā
sŏlasi yĕmmĕ lĕṁdainām̐ jūbudu gāni
yĕlami nī kabaḍamu lĕppuḍum̐ galave kāvā
piluvagu mayya nīdom̐ bĕnam̐ga noba mayyā
(||||)
kaḍu nannalayiṁchagu kaum̐ giḍam̐ gūḍe naṁṭā
vuḍivoni pūvuvalĕ nuṁduvu gāni
aḍari śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
taḍavi kūḍidi mādom̐ damaga mem̐ṭi kayyā