యెక్కడ వొయ్యేము మనమింతలోననూ
(॥పల్లవి॥)
యెక్కడ వొయ్యేము మనమింతలోననూ
వెక్కసాలు సేయఁబోతే వెగటులై తోఁచవా
(॥॥)
వావులు దెలిపి నే నే వచ్చితే నవ్వేవు గాక
చే వట్టి తియ్యకువయ్య చెప్పీఁ గాని
మోవి చూపి మాటాడితే మోహము చల్లేవు గాక
యీవేళ వేగిరించితే నెగసక్కెము గాదా
(॥॥)
చేతు లెత్తి మొక్కి చేఁత సేసితే మెచ్చేవు గాక
కాతరించ నేటికియ్య కై కొనెఁ గాని
యీతల నేఁ గొసరితే యియ్యకొనె దప్పుడింతే
యేతులకుఁ బెనఁగితే నిచ్చకము లనరా
(॥॥)
పంత మెచ్చి నీ కొంగు పట్టితేఁ గూడేవు గాక
అంతలోనె కలసితి వదేమో కాని
చెంతల శ్రీ వేంకటేశ చెల్లు నీకు నాకు నివి
మంతనాలు నెరపితే మాయలై నిలువవా.
(||pallavi||)
yĕkkaḍa vŏyyemu manamiṁtalonanū
vĕkkasālu seyam̐bode vĕgaḍulai tom̐savā
(||||)
vāvulu dĕlibi ne ne vachchide navvevu gāga
se vaṭṭi tiyyaguvayya sĕppīm̐ gāni
movi sūbi māḍāḍide mohamu sallevu gāga
yīveḽa vegiriṁchide nĕgasakkĕmu gādā
(||||)
sedu lĕtti mŏkki sem̐ta seside mĕchchevu gāga
kādariṁcha neḍigiyya kai kŏnĕm̐ gāni
yīdala nem̐ gŏsaride yiyyagŏnĕ dappuḍiṁte
yedulagum̐ bĕnam̐gide nichchagamu lanarā
(||||)
paṁta mĕchchi nī kŏṁgu paṭṭidem̐ gūḍevu gāga
aṁtalonĕ kalasidi vademo kāni
sĕṁtala śhrī veṁkaḍeśha sĕllu nīgu nāgu nivi
maṁtanālu nĕrabide māyalai niluvavā.