యెక్కడ పరాకు నీకు నెందు చూచేవు
(॥పల్లవి॥)
యెక్కడ పరాకు నీకు నెందు చూచేవు
గక్కన నాపె తమకము చూడవయ్యా
(॥॥)
గుబ్బలు గదలఁగాను కొప్పు గొంత జారఁగాను
తబ్బిబ్బుగా హారాలు తడఁబడఁగా
వుబ్బుతోడ వచ్చె నిదె వువిద నీకడకును
పబ్బిననీ మీఁది యాపె బత్తి చూడవయ్యా
(॥॥)
గాట్టపుఁ జెమట తోడ గాజులు గల్లనఁగాను
మేటి కుచ్చల మీఁగాళ్ళమీఁద వాలఁగా
వాటుఁ బరువున వచ్చె వనిత నీ కడకును
ఆఁటదాని యగ్గలిక అటుచూడవయ్యా
(॥॥)
తళుకుఁ గమ్మలదర తగనిట్టూర్పులు రేఁగ
పొలుపు టుద్దాలు చప్పుడు సేయఁగా
యెలమి శ్రీ వేంకటేశ ఇంతి వచ్చి నిన్నుఁగూడె
యిల మమ్మేలితి వాపె ఇంపు చూడవయ్యా
(||pallavi||)
yĕkkaḍa parāgu nīgu nĕṁdu sūsevu
gakkana nābĕ tamagamu sūḍavayyā
(||||)
gubbalu gadalam̐gānu kŏppu gŏṁta jāram̐gānu
tabbibbugā hārālu taḍam̐baḍam̐gā
vubbudoḍa vachchĕ nidĕ vuvida nīgaḍagunu
pabbinanī mīm̐di yābĕ batti sūḍavayyā
(||||)
gāṭṭabum̐ jĕmaḍa toḍa gājulu gallanam̐gānu
meḍi kuchchala mīm̐gāḽḽamīm̐da vālam̐gā
vāḍum̐ baruvuna vachchĕ vanida nī kaḍagunu
ām̐ṭadāni yaggaliga aḍusūḍavayyā
(||||)
taḽugum̐ gammaladara taganiṭṭūrbulu rem̐ga
pŏlubu ṭuddālu sappuḍu seyam̐gā
yĕlami śhrī veṁkaḍeśha iṁti vachchi ninnum̐gūḍĕ
yila mammelidi vābĕ iṁpu sūḍavayyā