Yekkada paraagu neegu nemdu soosevu

యెక్కడ పరాకు నీకు నెందు చూచేవు
Language

(॥పల్లవి॥)
యెక్కడ పరాకు నీకు నెందు చూచేవు
పిక్కటిల్లే వలపుల ప్రియ మిట్టిదయ్యా

(॥॥)
కుప్పలుఁ దెప్పలు నైన కోరికలు మదిలోన
వుప్పతిల్లుఁ జెమటలు వొళ్ళిమీఁ దను
దప్పి దేరే మాటల తరితీపు మోవిమీఁద
కప్పి వున్నది చెలికిఁ గనుఁ గొనవయ్యా

(॥॥)
తనివోని తలఁపుల తమి జవ్వనముమీఁద
వినియేటి వేడుకలు వీనులమీఁద
ననిచిన పొందుల నవ్వు సెలవుల మీఁద
గనమాయ నిదెవో కనుఁ గొనవయ్యా

(॥॥)
చిమ్మిరేఁ గే యటువంటి సిగ్గులు చన్నులమీఁద
కమ్ముకొన్న యడియాస కౌఁగిటిమీఁద
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి
కమ్మర మన్నించి యింకాఁ గనుఁ గొనవయ్యా

(||pallavi||)
yĕkkaḍa parāgu nīgu nĕṁdu sūsevu
pikkaḍille valabula priya miṭṭidayyā

(||||)
kuppalum̐ dĕppalu naina korigalu madilona
vuppadillum̐ jĕmaḍalu vŏḽḽimīm̐ danu
dappi dere māḍala taridību movimīm̐da
kappi vunnadi sĕligim̐ ganum̐ gŏnavayyā

(||||)
tanivoni talam̐pula tami javvanamumīm̐da
viniyeḍi veḍugalu vīnulamīm̐da
nanisina pŏṁdula navvu sĕlavula mīm̐da
ganamāya nidĕvo kanum̐ gŏnavayyā

(||||)
simmirem̐ ge yaḍuvaṁṭi siggulu sannulamīm̐da
kammugŏnna yaḍiyāsa kaum̐giḍimīm̐da
yimmula śhrī veṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
kammara manniṁchi yiṁkām̐ ganum̐ gŏnavayyā