యెక్కడ దిష్టి దాఁకునో యిందుకే చింతించి నీకు
(॥పల్లవి॥)
యెక్కడ దిష్టి దాఁకునో యిందుకే చింతించి నీకు
గక్కన నేడ తొడసు గలిగెనో తాను
(॥॥)
మగిడి మగిడి చూచి మతి నీ రూపు భావించి
చిగిరింపుఁ గోరికలఁ జెలఁగీ నింతి
జిగి నిట్టూర్పుల తోడ చెమటలు గారఁగాను
తగిలీ నీ వెంట వెంటఁదా నెవ్వతో యీపె
(॥॥)
అట్టే నీతో మాటలాడి నాయాలు గరఁగుకొంటా
యెట్ట నెదురు కట్టున నేఁకరీ నీకె
నట్ట నడుమ నూరకే నవ్వులు నవ్వుకొంటాను
చుట్టి చుట్టి యాసలతో జొచ్చిలీఁ దా నిదివో
(॥॥)
కోరి నీకు బాగా లిచ్చి కొంగు దాఁకించుకొంటాను
మేర మీఱి చన్ను లొత్తి మేను చొక్కీని
యీ రీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టే
కూరిమి గొసరీఁ దాను గొబ్బున నింకాను
(||pallavi||)
yĕkkaḍa diṣhṭi dām̐kuno yiṁduge siṁtiṁchi nīgu
gakkana neḍa tŏḍasu galigĕno tānu
(||||)
magiḍi magiḍi sūsi madi nī rūbu bhāviṁchi
sigiriṁpum̐ gorigalam̐ jĕlam̐gī niṁti
jigi niṭṭūrbula toḍa sĕmaḍalu gāram̐gānu
tagilī nī vĕṁṭa vĕṁṭam̐dā nĕvvado yībĕ
(||||)
aṭṭe nīdo māḍalāḍi nāyālu garam̐gugŏṁṭā
yĕṭṭa nĕduru kaṭṭuna nem̐karī nīgĕ
naṭṭa naḍuma nūrage navvulu navvugŏṁṭānu
suṭṭi suṭṭi yāsalado jŏchchilīm̐ dā nidivo
(||||)
kori nīgu bāgā lichchi kŏṁgu dām̐kiṁchugŏṁṭānu
mera mīṟi sannu lŏtti menu sŏkkīni
yī rīdi śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭe
kūrimi gŏsarīm̐ dānu gŏbbuna niṁkānu