యెగ్గు పట్టేవు సుమ్మీ యెఱుఁగ నేను
(॥పల్లవి॥)
యెగ్గు పట్టేవు సుమ్మీ యెఱుఁగ నేను
సిగ్గులు నీ వంటితేను చేతఁ జెనకుదును
(॥॥)
నీ విచ్చిన చనవున నీ చిత్త మెఱుఁగక
వే వేగ రావైతి వని వేగిరింతును
దేవులనై యుండిన మందెమేళాన నూరకే
పూవుల నీవు వేసితే బొమ్మల జంకింతునూ
(॥॥)
నాకు నీవు గల వని నమ్మిన గర్వమునను
పైకొని నిన్ను నేను గుబ్బల నొత్తుదు
రాకపోకల నీవు సరసమాడే వేడుకను
యేకాంతాలు చెవిలోన నేమైనా నాడుదును
(॥॥)
నాతో నీవు సారె సారె నవ్వే వనే మదమున
రాతిరిఁ బగలు నీతో రతి సేతును
యీతల శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
పోతరించి రాకొట్టఁ బొగడుదునూ
(||pallavi||)
yĕggu paṭṭevu summī yĕṟum̐ga nenu
siggulu nī vaṁṭidenu sedam̐ jĕnagudunu
(||||)
nī vichchina sanavuna nī sitta mĕṟum̐gaga
ve vega rāvaidi vani vegiriṁtunu
devulanai yuṁḍina maṁdĕmeḽāna nūrage
pūvula nīvu veside bŏmmala jaṁkiṁtunū
(||||)
nāgu nīvu gala vani nammina garvamunanu
paigŏni ninnu nenu gubbala nŏttudu
rāgabogala nīvu sarasamāḍe veḍuganu
yegāṁtālu sĕvilona nemainā nāḍudunu
(||||)
nādo nīvu sārĕ sārĕ navve vane madamuna
rādirim̐ bagalu nīdo radi sedunu
yīdala śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi
podariṁchi rāgŏṭṭam̐ bŏgaḍudunū