యెగ్గో తప్పో యెఱుఁగ నేమి సేతునయ్య నేను
(॥పల్లవి॥)
యెగ్గో తప్పో యెఱుఁగ నేమి సేతునయ్య నేను
సిగ్గుతో నుండక నిన్నుఁ జిమ్మి రేఁచవలసే
(॥॥)
విరుల వేసినఁ గాని వేడుకలు రేఁగవు
తెరఁ దీసితేఁ గాని తెలియరాదు
సరస మాడినఁ గాని చవులు వుట్టవు నీకు
యెరవు లే కటుగాన ఇంత సేయవలసే
(॥॥)
పట్టి పెనఁగక నీకు పరాకులు మానవు
చుట్టరికము చెప్పక సొంపు నిండదు
వొట్టు వెట్టి పిలువక వుదుటు నీకు మించదు
యిట్టే యిందుకుఁగా నిన్నింత సేయవలసే
(॥॥)
చన్నుల నొత్తి పట్టక సమరతి బెరయదు
కన్నుల జంకించక కమ్మదు తమి
మన్నించి శ్రీ వేంకటేశ నన్ను నేఁడేలితి విట్టే
ఇన్నిటా నాకు నిన్ను నింత సేయవలసే
(||pallavi||)
yĕggo tappo yĕṟum̐ga nemi sedunayya nenu
siggudo nuṁḍaga ninnum̐ jimmi rem̐savalase
(||||)
virula vesinam̐ gāni veḍugalu rem̐gavu
tĕram̐ dīsidem̐ gāni tĕliyarādu
sarasa māḍinam̐ gāni savulu vuṭṭavu nīgu
yĕravu le kaḍugāna iṁta seyavalase
(||||)
paṭṭi pĕnam̐gaga nīgu parāgulu mānavu
suṭṭarigamu sĕppaga sŏṁpu niṁḍadu
vŏṭṭu vĕṭṭi piluvaga vuduḍu nīgu miṁchadu
yiṭṭe yiṁdugum̐gā ninniṁta seyavalase
(||||)
sannula nŏtti paṭṭaga samaradi bĕrayadu
kannula jaṁkiṁchaga kammadu tami
manniṁchi śhrī veṁkaḍeśha nannu nem̐ḍelidi viṭṭe
inniḍā nāgu ninnu niṁta seyavalase