Yegge tomdugadaa??? yeṟamgam jeppamgadave

యెగ్గే తోఁదుగదా??? యెఱఁగఁ జెప్పఁగదవే
Language

(॥పల్లవి॥)
యెగ్గే తోఁదుగదా??? యెఱఁగఁ జెప్పఁగదవే
వెగ్గళపు రాజసాన వెలసీని యీతఁడు

(॥యెగ్గే॥)
సిగ్గువడి వుండితేను చిత్తమెట్టుండునో యంటా
దగ్గరి కాలు దొక్కితి దగవే కదే
అగ్గమై తలవంచితే నలిగితిన నీ నంటా
వొగ్గి సోఁక నాడితే నుచితమే కదవే

(॥యెగ్గే॥)
సంగడికి రాకుండితే చలమరి ననీనంటా
యెంగిలిమోవి యిచ్చితి యితనే కదే
కంగున మాఁటాడితేను గయ్యాళితనమౌనంటా
రంగు గుబ్బల నొత్తితి యింగితమౌ గదవే

(॥యెగ్గే॥)
గుట్టున నూ కుండితే కుచ్చిత మౌనోయంటా
బెట్టి(ట్టు) కాఁగిలించుకొంటి బ్రియమే కదే
యిట్టె శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
చుట్టమనయితి నిఁక సులభమే కదవే

(||pallavi||)
yĕgge tom̐dugadā??? yĕṟam̐gam̐ jĕppam̐gadave
vĕggaḽabu rājasāna vĕlasīni yīdam̐ḍu

(||yĕgge||)
sigguvaḍi vuṁḍidenu sittamĕṭṭuṁḍuno yaṁṭā
daggari kālu dŏkkidi dagave kade
aggamai talavaṁchide naligidina nī naṁṭā
vŏggi som̐ka nāḍide nusidame kadave

(||yĕgge||)
saṁgaḍigi rāguṁḍide salamari nanīnaṁṭā
yĕṁgilimovi yichchidi yidane kade
kaṁguna mām̐ṭāḍidenu gayyāḽidanamaunaṁṭā
raṁgu gubbala nŏttidi yiṁgidamau gadave

(||yĕgge||)
guṭṭuna nū kuṁḍide kuchchida maunoyaṁṭā
bĕṭṭi(ṭṭu) kām̐giliṁchugŏṁṭi briyame kade
yiṭṭĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
suṭṭamanayidi nim̐ka sulabhame kadave