యీకె విలాసము చూచి యింతట మన్నించవద్దా
(॥పల్లవి॥)
యీకె విలాసము చూచి యింతట మన్నించవద్దా
జోకలైన వలపు లెచ్చు నున్నవో కాకా
(॥॥)
కొసరి కొసరి నిన్నుఁ గొన చూపులనుఁ జూచి
అసురుసురై నీకుఁ బ్రియము చెప్పీని
ముసుఁగిడుకొని నీ ముందర నదిగో యింతి
వసివాడు మోముతో నీవద్ద బాయకున్నది
(॥॥)
పొలసి పొలసి నీతోఁ బోరచి పొందులు చూపి
తలఁపించీ సారె నీకుఁ దన మోహము
నిలువు నివ్వెరగుతో నిలుచున్న దదివో
వులివచ్చి విరహాన నోలలాడుచున్నది
(॥॥)
తగిలి తగిలి నీపైఁ దలఁబాలు చల్లి చల్లి
మొగము చూచి నీకు మొక్కు మొక్కీని
జిగి నలమేల్మంగ శ్రీ వేంకటేశ్వర యీకె
సొగిసి నీ రతులలోఁ జొక్కుచుఁ దా నున్నది
(||pallavi||)
yīgĕ vilāsamu sūsi yiṁtaḍa manniṁchavaddā
jogalaina valabu lĕchchu nunnavo kāgā
(||||)
kŏsari kŏsari ninnum̐ gŏna sūbulanum̐ jūsi
asurusurai nīgum̐ briyamu sĕppīni
musum̐giḍugŏni nī muṁdara nadigo yiṁti
vasivāḍu momudo nīvadda bāyagunnadi
(||||)
pŏlasi pŏlasi nīdom̐ borasi pŏṁdulu sūbi
talam̐piṁchī sārĕ nīgum̐ dana mohamu
niluvu nivvĕragudo nilusunna dadivo
vulivachchi virahāna nolalāḍusunnadi
(||||)
tagili tagili nībaim̐ dalam̐bālu salli salli
mŏgamu sūsi nīgu mŏkku mŏkkīni
jigi nalamelmaṁga śhrī veṁkaḍeśhvara yīgĕ
sŏgisi nī radulalom̐ jŏkkusum̐ dā nunnadi